S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/05/2016 - 07:38

గుంటూరు, సెప్టెంబర్ 4: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారత సర్వేకు నిధుల గ్రహణం పట్టింది. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సర్వేను ప్రారంభించారు. అయితే సిఎంకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారమే ఇప్పటికీ ప్రొఫార్మాలో పూర్తికాలేదు. ముఖ్యమంత్రి ఓటరు ఐడితో పాటు ఆధార్ కార్డులు హైదరాబాద్‌లో నమోదయి ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు బదిలీ చేయలేదని సమాచారం.

09/05/2016 - 07:36

శ్రీకాకుళం, సెప్టెంబర్ 4: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చెందిన ఖాళీ స్థలం మార్కెట్ విలువ రెండు కోట్ల రూపాయలు ఉండగా, దీనిని కారుచౌకగా కొట్టేయడానికి శ్రీకాకుళం తెలుగు ‘తమ్ముళ్ళు’ ఎవరి స్థాయిలో వారు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.

09/05/2016 - 05:39

పెనుమూరు, సెప్టెంబర్ 4: చిత్తూరు జిల్లా ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. పెనుమూరు మండల పరిధిలోని పూనేపల్లి వద్ద ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో దినేష్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పూనేపల్లికి చెందిన మురగారెడ్డి కుమారుడు దినేష్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు.

09/05/2016 - 05:37

నెల్లూరు, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో 52 వేల కోట్ల వ్యయంతో మూడు పెట్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనన్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వీటిలో పెట్రోలియం యూనివర్శిటీ, విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణ, పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాలు ఉంటాయని, త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారని తెలిపారు.

09/04/2016 - 05:30

వెంకటాచలం, సెప్టెంబర్ 3 : 2022 నాటికి ఒక్క పూరిల్లు లేని దేశంగా భారత్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోది అహర్నిశలు శ్రమిస్తున్నారని కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్ వద్ద బిఎంపిటిసి అధ్వర్యంలో 4.55 కోట్లతో నూతనంగా నిర్మించిన నమూనా గృహ సముదాయన్ని శనివారం ఆయన ప్రారంభించారు.

09/04/2016 - 04:35

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 3: గోదావరి పుష్కరాల సందర్భంగా గత ఏడాది జూలై 14వ తేదీన పుష్కర తొక్కిసలాట ఘటనపై శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో జస్టిస్ సివై సోమయాజులు కమిషన్ విచారణ నిర్వహించింది. కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకు వుంది. ఈలోగా సమగ్ర సమాచారాన్ని సేకరించి తదుపరి విచారణకు వెళ్లేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ విచారణలో లోతైన రీతిలో విచారణ జరిపింది.

09/04/2016 - 04:30

హిందూపురం, సెప్టెంబర్ 3: రక్షక తడుల పేరిట అనంతపురం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇచ్చారే తప్ప ఎండిపోతున్న వేరుశెనగ పంట ఒక్క ఎకరా కూడా కాపాడలేకపోయారని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. రెయిన్‌గన్ల పేరిట చంద్రబాబు షో చేసి మరోమారు రైతాంగాన్ని దగా చేశారని విమర్శించారు.

09/04/2016 - 04:25

మండపేట, సెప్టెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలోని సురుచి ఫుడ్స్ సంస్థ హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వద్ద ప్రతిష్ఠించే గణేష్ మహరాజ్ చేతిలో ఉంచేందుకు ఉచితంగా అందించే 500 కిలోల లడ్డూ సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నానికి లడ్డూ తయారీ పూర్తవుతుంది.

09/04/2016 - 04:24

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై అన్ని స్థాయిల్లోను తర్జన భర్జన జరుగుతున్న నేపధ్యంలో శనివారం నగరంలో జరిగిన బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల సమావేశంలో పాల్గొన్న పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ మాత్రం ప్రత్యేక హోదా లేనట్లేనని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది.

09/04/2016 - 04:24

గాజువాక, సెప్టెంబర్ 3: దేశంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో రెండు భారీ గణనాథుల విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ఇందులో లంకా మైదానంలో వినాయక చవితిని పురష్కరించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వర్డల్డ్ రికార్డ్స్ స్థానం కోసం గాజువాకలోని విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశ్వ) ఆధ్వర్యంలో లంకా మైదానంలో ఏర్పాటు చేస్తున్న 78 అడుగుల భారీ గణనాథుని విగ్రహం ఒకటి.

Pages