S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/03/2016 - 18:06

విజయవాడ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ఎక్కడా కరవు లేదని, కరవును జయించామని సిఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని వైకాపా అధినేత జగన్ విమర్శించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి సర్కారుకు చిత్తిశుద్ధి లేదన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించకుంటే పాలకులు ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదన్నారు.

09/03/2016 - 17:54

విజయవాడ: ప్రత్యేక ప్యాకేజీనా, ప్రత్యేక హోదా అనేది త్వరలో వెలువడనుంది... తొందర్లోనే ఏపీ ప్రజలు శుభవార్త వింటారని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. హోదా పేరు లేకుండా మంచి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు విష్ణు చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, అమిత్ షాను కలవనున్నట్లు ప్రస్తుతం ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని ఆయన అన్నారు.

09/03/2016 - 17:48

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని టీడీపీ లీగల్‌ సెల్‌ నేతలు ఈసీకి శనివారం ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యేగా ఎన్నికయినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.

09/03/2016 - 17:12

అమరావతి: ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్‌ ఎదుట ఒప్పంద అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల యూనియన్‌ సభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్షను రద్దుచేయాలని ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09/03/2016 - 16:59

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజల్లో అయోమయం నెలకొందని, పార్టీపై అసంతృప్తి పెరుగుతోందని బీజేపీ పదాధికారుల సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని పలువురు నేతలు సమావేశంలో కోరినట్లు తెలిసింది. ఏపీకి అందించేది హోదానా, ప్యాకేజీనా ఏదో ఒకటి తేల్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అమిత్‌షా వద్దకు రాష్ట్ర బీజేపీ నేతలను తీసుకెళ్లాలని పదాధికారులు నిర్ణయించారు.

09/03/2016 - 16:55

హైదరాబాద్: కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తీసుకుంటాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తామని ఏపీ టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. ప్రత్యేక హెదాపై భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ఏపీ నష్టపోతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమన్నారు. ఇచ్చింది వద్దు... రానిదాని కోసం ప్రయత్నం చేద్దాం..

09/03/2016 - 15:00

విజయవాడ: ‘‘కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.’’ అంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నటుడు శివాజీని శనివారం హెచ్చరించారు. తెలుగుదేశం నేతలపై విమర్శలకు వెంకన్న గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని ప్రజలు తరిమికొడతారని ఎమ్మెల్సీ హెచ్చరించారు.

09/03/2016 - 14:23

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌ కూడా ఉందని, ఇప్పుడు కేంద్రం ప్యాకేజీ ఇస్తాన్నందున దాన్ని తీసుకోవడం సబబని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ శనివారం పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే దాన్ని తీసుకొని రాని వాటికోసం పోరాడటం వివేకుల లక్షణమని స్పష్టం చేశారు. ప్యాకేజీ కూడా వద్దు అన్న రీతిలో జగన్‌ వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

09/03/2016 - 13:16

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం శనివారం విజయవాడలో ప్రారంభమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జి సిద్దార్ధనాథ్‌ సింగ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంపీ గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతోపాటు నాయకులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.

09/03/2016 - 12:49

అనంతపురం: వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్‌ దగ్గర ఎండిన వేరుశనగ పంటలను శనివారం రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. వర్షాభావం వల్ల వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, ఇప్పడు రెయిన్‌గన్‌లు ఇవ్వడంవల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.

Pages