S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/03/2016 - 06:24

గుంటూరు, సెప్టెంబర్ 2: పర్యాటకరంగంలో సైతం ప్రభుత్వం స్విస్ ఛాలెంజి విధానాన్ని అవలంబించటం ద్వారా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ గర్భాల్లో ఉన్న వేలాది ఎకరాల దీవులలో పార్కులు.. రెస్టారెంట్లు.. స్టార్ హోటళ్లతో పాటు బోటు షికార్లను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పనతో పాటు సేవల రంగం ద్వారా వృద్ధిరేటు సాధించేందుకు ప్రణాళిక సిద్ధమయింది.

09/03/2016 - 06:23

కడప, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వైఎఎస్ వర్ధంతి సందర్భంగా ఘాట్‌ను రంగురంగుల పూలతో అలంకరించారు.

09/03/2016 - 06:13

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలుగుదేశం తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీని దెబ్బకు దెబ్బ తీయనుందా? ఓటుకునోటు కేసులో సీఎం, తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీతో నోటీసులు ఇప్పించి ఇబ్బందిపెట్టిన వైసీపీపై, అధికార తెదేపా ప్రభుత్వం అదే కేసుల ఉచ్చు బిగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

09/03/2016 - 06:11

కాకినాడ, సెప్టెంబర్ 2: భారతదేశంతో ఎల్లపుడూ ఆస్ట్రేలియా దౌత్య సంబంధాలను కొనసాగిస్తోందని భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ సిద్ధూ అన్నారు.

09/03/2016 - 05:34

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పచ్చి బోగస్ అని, రూ.400 కోట్లు అదనంగా చెల్లించారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో బహిరంగంగా నిరూపించడానికి సిద్ధమని, ప్రభుత్వం తరఫున ప్రతినిధులెవరినైనా పంపించాలని ఆయన సవాల్‌చేశారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/03/2016 - 05:20

అనంతపురం, సెప్టెంబర్ 2:‘గడచిన ఆరేడు రోజులుగా కరవుతో యుద్ధం చేశాం. యుద్ధంలో చిన్నచిన్న దెబ్బలు తగిలాయి. అయితే అంతిమ విజయం మనదే. ఈ రోజు అదే జరిగింది. దీంతో కరవును జయిస్తామన్న భరోసా వచ్చింది. భవిష్యత్తులో కరవును జయిస్తాం. ఎలాంటి సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

09/03/2016 - 05:18

ఆదోని సెప్టెంబర్ 2 : రాష్ట్ర హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కోసం కేంద్రంతో మెతక వైఖరి అవలంబిస్తున్నానని కొంతమంది చేస్తున్న ఆరోపణ ల్లో వాస్తవం లేదన్నారు. హోదా కోసం కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నామన్నారు.

09/03/2016 - 05:16

విజయవాడ, సెప్టెంబర్ 2:అమరావతిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభమైంది. అమరావతిలోని వెలగపూడిలో ఐదు బ్లాకుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 27 నుంచి ఇక్కడి నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఉద్యోగులైతే వచ్చారు కానీ, భవనాలు అప్పటికి పూర్తికాలేదు. సిఎం స్వయంగా పర్యవేక్షణ ప్రారంభించడంతో పనులు వేగవంతం అయ్యాయి.

09/03/2016 - 05:14

కర్నూలు, సెప్టెంబర్ 2: దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న విజయ సాగర్‌బాబు వద్ద లభ్యమైన అవినీతి సొమ్ములో సింహభాగం శ్రీశైల మల్లికార్జునుడిదే అని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. విజయసాగర్‌బాబు రెండు నెలల క్రితం వరకూ శ్రీశైలం దేవస్థానం ఆలయ ఇఓగా పని చేశారు. శ్రీశైలం దేవస్థానం స్థాయిని పెంచి జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన అధికారిని ఇఓగా నియమించడంతో సాగర్‌బాబు బదిలీపై వెళ్లారు.

09/02/2016 - 18:17

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎపి మంత్రిమండలి సమావేశం ఈనెల 6న ఇక్కడ జరుగనుంది. రాజధాని నిర్మాణం, కేంద్ర నిధులు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ఇరిగేషన్ ప్రాజెక్టులు, విభజన సమస్యలు వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సిఎం మంత్రులతో సమీక్షిస్తారు.

Pages