S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2016 - 04:51

విశాఖపట్నం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి వినూత్న రీతిలో నిరసన తెలపాలన్న టిడిపి అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు బాగానే స్పందించారు. ఆ పార్టీ ఎమ్మేల్యే ఏకంగా పీఠాధిపతిగా అవతారమెత్తారు. అంతటితో ఆగకుండా బిజెపి తరపున ఏపీ అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

08/02/2016 - 04:49

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావడంతోనే హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారని వైకాపా పార్లమెంట్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రధాన మంత్రి లీక్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

08/02/2016 - 04:47

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ( ఎపిపిఎస్‌సి) ద్వారా జరిపే ప్రత్యక్ష నియామకాలకు నిర్వహించే పరీక్ష విధివిధానాలను ప్రభుత్వం సోమవారం నాడు ఖరారు చేసింది. గ్రూప్ -1ఎ పరీక్ష 825 మార్కులకు , గ్రూప్ 1బి పరీక్ష 450 మార్కులకు, పంచాయతీ సెక్రటరీల ఎంపిక పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నారు.

08/02/2016 - 04:46

హైదరాబాద్, ఆగస్టు 1: ఇంతకాలంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కార్యాలయం విజయవాడకు తరలివెళ్లనుంది. 4వ తేదీన ఎస్‌ఎస్‌ఎ కార్యాలయాన్ని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆఫీసుకు సంబంధించిన ఫైళ్లు, ఫర్నీచర్ విజయవాడకు తరలివెళ్లాయి.

08/01/2016 - 18:11

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా ఎపి అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, రాజధాని కూడా లేకుండా చేశారని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి ఎపిని కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

08/01/2016 - 18:10

దిల్లీ: ఎన్‌డిఎలో తాము భాగస్వామిగా ఉంటూనే ఎపికి ప్రత్యేకహోదా సాధించుకుంటామని టిడిపి ఎంపీలు సోమవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా వేచి చూశామని, తమ సహనాన్ని పిరికితనం కింద జమచేయవద్దన్నారు. ప్రజల స్పందన మేరకు తమ ఆందోళనను దశల వారీగా తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

08/01/2016 - 15:46

కాకినాడ: పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల సందర్భంగా శంఖవరం మండలం మండపం గ్రామంలో సోమవారం ఉదయం టిడిపి, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత కారణంగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

08/01/2016 - 15:45

దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా అడగనందునే ఎపిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపీలు నాటకాలాడుతున్నారని వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

08/01/2016 - 13:05

అనంతపురం: అప్పుల విషయమై భర్తతో గొడవ జరిగాక తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లిలో సోమవారం ఈ దారుణం వెలుగు చూసింది. అప్పుల విషయమై ఆదివారం సాయంత్రం ఆనందరెడ్డి, భారతి దంపతుల మధ్య గొడవ జరిగింది. స్థానిక పెద్దలు రాజీ కుదిర్చాక ఇంట్లోకి వెళ్లేందుకు భారతి అంగీకరించింది.

08/01/2016 - 12:44

రాజమండ్రి: గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా సోమవారం రెండో రోజు పుణ్యస్నానాలు చేసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరుతో పాటు పలు చోట్ల ఘాట్‌లలో భక్తులు భారీ సంఖ్యలో కనిపించారు. తెలంగాణలో భద్రాచలం, బాసర, మంచిర్యాల, గూడెం తదితర ప్రాంతాల్లో గోదావరి నదీ తీరాన భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Pages