S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2016 - 12:50

తిరుపతి : తితిదే అధ్యక్షుడు చదల వాడ కృష్ణమూర్తి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈవో సాంబశివరావు, పాలకమండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, జె.శేఖర్‌, ఏవీరమణ, భానుప్రకాశ్‌రెడ్డి, యల్లా సుచిత్ర, కృష్ణమూర్తి సమావేశానికి హాజరయ్యారు. అజెండాలోని 22 అంశాలకు సంబంధించి చర్చిస్తున్నారు.

08/02/2016 - 12:02

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. వైకాపా, వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

08/02/2016 - 11:51

గుంటూరు : పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. పొన్నూరులోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని నరేంద్రడిమాండ్‌ చేశారు.

08/02/2016 - 11:48

గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పలువురు నేతలను పోలీసలు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటలకే బస్టాండు వద్దకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రాస్తారోకో చేపట్టారు. గుంటూరు-విజయవాడతో పాటు రాజధాని సచివాలయం వెలగపూడికి వెళ్లె బస్సులన్నీ నిలిచిపోయాయి.

,
08/02/2016 - 05:55

రాజమహేంద్రవరం, ఆగస్టు 1: గోదావరి అంత్య పుష్కర యాత్రికుల రద్దీ ప్రవాహంలా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి యాత్రికులు పుణ్యస్నానాలకు వస్తూనే వున్నారు. రోజు రోజుకూ యాత్రికుల రద్దీ పెరుగుతుంటే, మరో వైపు అఖండ గోదావరి నదికి వరద తాకిడి కూడా పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ స్నాన ఘట్టాల్లో సోమవారం సుమారు లక్షా 13వేల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనావేశారు.

08/02/2016 - 05:56

భద్రాచలం, ఆగస్టు 1: అంత్య పుష్కరాల సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామ దివ్యక్షేత్రంలోని గోదావరి తీరం సోమవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జీవనది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08/02/2016 - 05:49

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ ప్రజల బలమైన కోరికైన ప్రత్యేక హోదా అంశాన్ని విపక్షాలు రాజకీయం చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర విమర్శించారు.

08/02/2016 - 05:47

తిరుపతి, ఆగస్టు 1: వికలాంగులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు సంబంధించి అన్ని స్థాయుల్లో అనుమతులు లభించినా కలెక్టర్ కార్యాలయంలో జాప్యం జరుగుతుండటంతో నిరసించిన వికలాంగుల సంఘం జిల్లా నాయకుడు మాధవయ్య తిరుపతిలోని తాతయ్య గంగమ్మ గుడి సమీపంలో సెల్ టవర్ ఎక్కి ఇళ్లస్థలాలు ఇస్తారా.. దూకి చావమంటారా అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు హడావుడి పడాల్సిన పరిస్థితి సోమవారం తలెత్తింది.

08/02/2016 - 05:45

అనంతపురం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే యోచన కేంద్రానికి లేదన్నారు. ఎన్ని బంద్‌లు, ఆందోళనలు చేసినా నిష్ప్రయోజనమేనన్నారు. హోదా రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అనంతపురం జిల్లానేనని అన్నారు.

08/02/2016 - 05:44

విజయవాడ, ఆగస్టు 1: పార్లమెంట్‌లో, టిడిపి ప్రభుత్వంలో కదలిక రావటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల ప్రజలు ఒకే గొంతుతో నినదించి, మంగళవారం బంద్‌కు మద్దతు తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.

Pages