S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2016 - 05:42

కుప్పం, ఆగస్టు 1: తరచూ తనకు ఆడపిల్లలే పుడుతున్నారని ఓ కసాయి తండ్రి ఇద్దరు ఆడపిల్లలను చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని నూలుకుంట పంచాయతీకి చెందిన మదనపురం గ్రామంలో మునస్వామి, లక్ష్మిలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

08/02/2016 - 05:35

గుంటూరు, ఆగస్టు 1: మద్యం మత్తులో మంత్రి తనయుడు వీరంగం సృష్టించాడు. ఈ ఉదంతం గుంటూరు నగరంలో వెలుగుచూసింది.. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న జిల్లాకు చెందిన ఓ మంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గప్‌చుప్‌గా సద్దుమణిగింది.

08/02/2016 - 05:33

విశాఖపట్నం, ఆగస్టు 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వెబ్‌సైట్లను నిర్వహించడమే కాకుండా అప్‌డేట్ చేయకపోవడంపై అధికారులను ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఎయు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అయితే తరువాతి కాలంలో పరీక్ష సమాచారం కోసం మరొక వెబ్‌సైట్‌ను రూపొందించారు.

08/02/2016 - 05:32

విజయనగరం, ఆగస్టు 1: అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని హామీ ఇచ్చిన బిజెపి ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమి లేదని గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని ఆరోపించారు. ప్రత్యేక నిధుల పేరుతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ సహాయం అందడంలేదన్నారు.

08/02/2016 - 05:31

బుక్కరాయసముద్రం, ఆగస్టు 1: ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన ఓ తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారకర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పంచాయితీ పరిధి కొట్టాలపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన భారతి(25) తన ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(6), కుమారుడు(6 నెలలు)కు విషమిచ్చి అనంతరం తానూ ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/02/2016 - 05:30

విశాఖపట్నం, ఆగస్టు 1: ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం కూడా కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

08/02/2016 - 05:29

కడప, ఆగస్టు 1: కడపలో ఎపిడ్రిన్ ముఠాను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్సీ(డిఆర్‌ఐ) అధికారులు అరెస్టుచేసినట్ల సమాచారం. ఈ ముఠానుంచి రూ.4.5 కోట్ల విలువచేసే ఎపిడ్రిన్(మత్తు పదార్థం) స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

08/02/2016 - 05:29

పుత్తూరు, ఆగస్టు 1: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఎగువ కృష్ణాపురం మామిడితోటలో ఓ గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎగువ కృష్ణాపురం వద్ద ఉన్న మామిడితోటలో 18 ఏళ్ల వయసు కలిగిన ఓ యువతిని హత్య చేసిన అగంతుకులు ఆమె శరీరాన్ని తగలబెట్టారు. ఈ సంఘటనలో ఆమె శరీరం మోకాళ్ల వరకు పూర్తిగా కాలిపోయింది. సోమవారం స్థానికులు గుర్తించి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

08/02/2016 - 04:54

విజయవాడ, ఆగస్టు 1: తిరుమలలో అన్నదానం కార్యక్రమానికి టిటిడి ఎంత ప్రాచుర్యం కల్పించిందో ప్రాణదానం పథకాన్ని అదేస్థాయిలో భక్తుల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణదానం పథకానికి ప్రచారం కల్పిస్తే పెద్దఎత్తున దాతలు ముందుకొస్తారని అన్నారు. తద్వారా మరింత మంది పేదలకు వైద్యం అందించవచ్చని సూచించారు.

08/02/2016 - 04:52

న్యూఢిల్లీ, ఆగస్టు 1: విభజన హామీల అమలుకు ఎన్డీయే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. సొమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, హోదా విషయంలో ఉన్న ఇబ్బందులను అధిగమించి ఏపీకి ఏం సహాయం చేయాలన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. ఏపీని ఆదుకోవాడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ఏపీని అన్ని విధాలుగా అందుకుంటుందని స్పష్టం చేశారు.

Pages