S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/03/2016 - 11:46

దిల్లీ: ఎపిలో అన్ని చోట్లా టిడిపి నేతల ఇళ్ల ముందు చీపుర్లతో తమ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరుపుతారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం జరిపిన రాష్టబ్రంద్‌తో కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు. హోదా విషయంలో టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

08/03/2016 - 07:40

విశాఖపట్నం, ఆగస్టు 2: వాయువ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీనికి తోడు ఒడిశా నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

08/03/2016 - 07:39

నూజివీడు, ఆగస్టు 2: పోలవరం కుడికాల్వకు పడిన గండి పూడ్చివేత పనులను మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం చేశారు. గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల నుండి పోలవరం కాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలో 122 కి.మీ. అండర్ టనె్నల్ వద్ద కాల్వకు గండి పడింది.

08/03/2016 - 07:40

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: అంత్య పుష్కరాలకు బంద్ సెగ తగిలింది.. మంగళవారం రద్దీ కాస్త మందగించింది. పుష్కర పుణ్య స్నానాలు అంతంతమాత్రంగా సాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, సరస్వతి విఐపి ఘాట్‌లలో రద్దీ బాగానే ఉంది. ఉదయం నుంచీ జిల్లావ్యాప్త యాత్రికుల రద్దీ కన్పించగా, తొమ్మిది గంటల నుంచి రైళ్లలో జిల్లా యేతర యాత్రికులు పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించారు.

08/03/2016 - 07:35

విజయవాడ, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మంగళవారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ముఖ్యంగా విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. సినిమా హాళ్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అర్ధరాత్రి నుంచే నాయకుల అరెస్టుల పర్వం ప్రారంభించారు.

08/03/2016 - 07:28

విశాఖపట్నం, ఆగస్టు 2: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక వేత్త డాక్టర్ జహీర్ అహ్మద్ విశాఖలో 139 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. పింగళి జయంతి సందర్భంగా మంగళవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ప్రదర్శించారు.

08/03/2016 - 07:27

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వపరంగా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత ఉందని, అది అమలుచేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు.

08/03/2016 - 07:24

హైదరాబాద్, ఆగస్టు 2: మల్లన్న సాగర్ రిజర్వాయర్ బాధితులను కలిసి పరామర్శించేందుకు మలి విడత ప్రయత్నం చేయాలని, ఈ దఫా లాఠీ దెబ్బలకు, పోలీసు తూటాలకు గురైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో-పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్ రానున్నందున అదే రోజున పెద్ద ఎత్తున చలో మల్లన్న సాగర్‌కు బయలుదేరాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

08/03/2016 - 07:24

హైదరాబాద్, ఆగస్టు 2: సాగునీటి ఎత్తి పోతల పథకాలతో విద్యుత్ వాడకంపై తప్పని సరిగా ఆడిటింగ్ జరగాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఇండియాకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఎనర్జీ ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి నిర్ణయించారు.

08/03/2016 - 07:23

తిరుపతి, ఆగస్టు 2 : భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి, అలుమేలు మంగమ్మ ప్రతిమలతో వెండి డాలర్లను తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 5, 10 గ్రాములతో రెండు రకాలైన డాలర్లను తయారు చేస్తారు. ఇందుకోసం టిటిడి రూ.5.5కోట్ల రూపాయలను కేటాయించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Pages