S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/06/2016 - 03:50

బుక్కరాయసముద్రం, జూలై 5: అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారం నుంచి సోమవారం రాత్రి జీవిత ఖైదీ హరిజన పెద్దింటి ఎరికలన్న(40) పరారయ్యాడు. ఈ మేరకు జైలు అధికారులు బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/06/2016 - 03:49

అనంతపురం, జూలై 5: చంద్రన్న రంజాన్ తోఫా సరుకులు అందని వారు ఈనెల 15వ తేదీ వరకు తీసుకోవచ్చని పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. మంగళవారం అనంతపురం నగరంలో చౌకదుకాణాలను మంత్రి తనిఖీ చేశారు.

07/06/2016 - 04:10

నెల్లూరు రూరల్, జూలై 5: దేశ చరిత్ర పుటలలో హిందూ ధర్మంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నవారు శ్రీరామానుజాచార్యులు అని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి హితబోధ చేశారు.

07/06/2016 - 04:12

గుంటూరు, జూలై 5: మైనారిటీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో తూర్పు నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటయిన ఇఫ్తార్ విందుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/06/2016 - 03:45

ఏలూరు, జూలై 5: మాకు వేతనాలు పెంచండంటూ ప్రజాప్రతినిధులు సైతం ఇటీవలి కాలంలో విజ్ఞప్తులు చేయటం, సొంతంగానే తీర్మానాలు చేసుకుని అమలుచేసుకోవటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఇందుకు పూర్తి భిన్నమైన శైలిలో సంక్షేమ బాట దిశగా అడుగులువేసి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.

07/06/2016 - 03:43

విశాఖపట్నం, జూలై 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లతో ఎస్పీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. విశాఖలోని ఎస్సీ హాస్టల్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని న్యాయ సంబంధమైన చిక్కుల కారణంగా యాక్షన్ ప్లాన్ అమల్లో జాప్యం చోటుచేసుకుందన్నారు.

07/06/2016 - 03:42

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా బుడితి రాజశేఖర్, స్ర్తి శిశు సంక్షేమ కార్యదర్శిగా జి జయలక్ష్మి, స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కో-ఆపరేటివ్ సొసైటీ ప్రత్యేక కమిషనర్‌గా జె మురళిని నియమించారు.

07/06/2016 - 03:41

హైదరాబాద్, జూలై 5: అమరావతి దేవాలయానికి చెందిన చెన్నైలో సదావర్తి భూములను మంత్రివర్గం, గవర్నర్‌కు తెలియకుండా దేవాదాయ శాఖ ఏకపక్షంగా ఎలా వేలం వేసి విక్రయిస్తుందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తే అసలైన దోషులు బయటకు వస్తారని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వివరించనున్నట్లు చెప్పారు.

07/05/2016 - 18:14

కర్నూలు: లంచం ఇవ్వలేదంటూ లారీ డ్రైవర్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. గోస్పాడు మండలం సాంబవరం మెట్ట దగ్గర పోలీసుల దాడిలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/05/2016 - 18:11

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టులో పంపులను బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించేందుకు టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Pages