S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/05/2016 - 05:38

విజయవాడ, జూలై 4: బయోటెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను త్వరలో లీడర్‌లా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బయో టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచానికి గమ్యస్థానం చేసే ప్రయత్నాలకు సోమవారం బీజం పడింది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్, గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్క్‌తో కలిసి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన త్వరలో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది.

07/05/2016 - 05:36

తిరుమల, జూలై 4: పోలీస్ శాఖలో త్వరలో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు ప్రకటించారు. సోమవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయం వెలుపల విలేఖర్లతో మాట్లాడుతూ విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,800 మంది పోలీసులు రానున్నారన్నారు. ఈమేరకు అన్ని చర్యలూ పూర్తయ్యాయన్నారు.

07/05/2016 - 05:36

విశాఖపట్నం, జూలై 4: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ విడుదలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ భార్య లలిత, పిల్లలను సోమవారం మంత్రి పల్లె పరామర్శించారు.

07/05/2016 - 05:35

విజయనగరం(టౌన్), జూలై 4: జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేను నిర్వాసిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. సోమవారం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామం జమ్మయ్యపేటలో సర్వే నిర్వహించేందుకు భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి సిబ్బందితో వచ్చారు.

07/05/2016 - 05:35

కర్నూలు, జూలై 4: రాష్ట్రంలో అధికార పక్షం ప్రజల వివరాలు సేకరించడానికి ఇంటింటి సర్వే పేరుతో అధికారులను జనంలోకి పంపుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని అదే ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైకాపా నేతలు గడప గడపకూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కరోజు తేడాతో ప్రభుత్వ, ప్రతిపక్ష కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

07/05/2016 - 05:26

తిరుపతి, జూలై 4: శ్రీవారి భక్తులకు అవసరమైన తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఇకపై 24 గంటలపాటూ కాల్‌సెంటర్లు అందుబాటులో ఉండేలా టిటిడి ఇఓ సాంబశివరావు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయం, ఇతర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి తెలుసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది. అదేవిధంగా టిటిడి అందిస్తున్న వసతులపై సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉన్న విషయం విదితమే.

07/05/2016 - 05:24

మదనపల్లె, జూలై 4: ‘మా బిడ్డను బతికించుకోలేం.. కనీసం చంపుకోవడానికైనా అనుమతివ్వండి’ అంటూ ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న రాయపేట నారాయణ, శ్యామలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరు దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

07/04/2016 - 18:29

విజయవాడ: రోడ్ల విస్తరణ, కృష్ణా పుష్కరాల పేరిట విజయవాడలో తొలగించిన ఆలయాలన్నింటినీ మళ్లీ నిర్మిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన సోమవారం పుష్కరాల పనులను పరిశీలించాక మీడియాతో మాట్లాడుతూ, ఏ ఒక్క వర్గాన్నీ బాధ పెట్టాలన్నది ప్రభుత్వం అభిమతం కాదన్నారు. అన్ని మతాల మనోభావాలను తాము గౌరవిస్తామన్నారు.

07/04/2016 - 18:28

విశాఖ: 2010లో రెండు కీలక ఫైళ్లు అదృశ్యమైనట్టు న్యాయమూర్తి ఫిర్యాదు చేసినప్పటికీ, విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ సోమవారం తెలిపారు.

07/04/2016 - 17:14

విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న 20 మంది ప్రభుత్వ వైద్యులకు మూడేళ్లపాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వీరిపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.

Pages