S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2016 - 17:14

విజయవాడ: రోడ్ల విస్తరణ, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్ల పేరిట పురాతన ఆలయాలను కూల్చివేయడం ఈ రాష్ట్రానికే అరిష్టం అని పలువురు స్వామీజీలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై వారు ఈరోజు సిఎం చంద్రబాబును కలిసి తమ మనోభావాలను తెలిపారు. తమ అభిప్రాయాలను విన్నాక సిఎం సానుకూలంగా స్పందించారని, పుష్కరాల విషయమై తమతో సంప్రదించేందుకు సుముఖత చూపారని స్వామీజీలు తెలిపారు.

07/04/2016 - 17:13

చిత్తూరు: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ రైతు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించడం ఇక్కడ సంచలనం కలిగించింది. ఎస్‌ఆర్ పురం మండలం పిల్లిగుండ్లపల్లికి చెందిన కృష్ణయ్య అనే రైతు కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల విభాగానికి సోమవారం ఉదయం వచ్చాడు. తన వద్ద ఉన్న నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కృష్ణయ్యకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

07/04/2016 - 17:13

విశాఖ: ఆధ్యాత్మిక, విద్యాసంస్థలతో ప్రాముఖ్యత సంతరించుకున్నందున పుట్టపర్తిలోని ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు హామీ ఇచ్చారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలని అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ అశోక్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

07/04/2016 - 17:12

గుంటూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్‌రోకో నిర్వహించిన పలువురు నేతలపై కేసులను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుత రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పలువురు కాంగ్రెస్, వైకాపా నేతలపై కూడా రైల్వే కేసులను కొట్టివేశారు.

07/04/2016 - 17:12

తిరుపతి: మూడు వేల రూపాయల విలువ చేసే శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్లను బెంగళూరుకు చెందిన భక్తులకు 33 వేల రూపాయలకు బ్లాకులో విక్రయించిన టిటిడి ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. పలువురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో దర్శనం టిక్కెట్లు బ్లాకులో అమ్మేసిన ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు.

07/04/2016 - 13:49

దిల్లీ: తన ఎన్నిక చెల్లదంటూ రాయుడు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని నగరి వైకాపా ఎమ్మెల్యే,సినీ నటి రోజా వేసిన అర్జీని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాయుడు వేసిన పిటిషన్ చెల్లదంటూ గతంలో రోజా దాఖలు చేసిన అర్జీని హైకోర్టు త్రోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు.

07/04/2016 - 13:48

అనంతపురం: బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు వద్ద సోమవారం ఉదయం మితిమీరిన వేగంతో వస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న రాధాకృష్ణ, పెద్దన్న అనే నడి వయస్కులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

07/04/2016 - 13:48

గుంటూరు: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నుంచి ఎపి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియకు తెలిపారు. ఆయన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. కొన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులంతా ఇక్కడికి తరలివస్తారని, వెలగపూడిలో సచివాలయం తాత్కాలికమే అయినా భవనాలను మాత్రం శాశ్వత ప్రాతిపదికలో నిర్మిస్తున్నామన్నారు.

07/04/2016 - 12:28

హైదరాబాద్: ఈ నెల 8 నుంచి ఎపిలో ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యవర్గ సమావేశం ఇక్కడ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు.

07/04/2016 - 12:28

గుంటూరు: వెలగపూడిలో గత నెల 29న ప్రారంభించిన తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాలను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం పరిశీలించారు. చైనా పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు మంత్రి అయ్యన్నపాత్రుడు తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న కార్యాలయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Pages