S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/05/2016 - 15:37

విజయవాడ: తప్పుడు కథనాలను ప్రచురించారన్న అభియోగంపై రాజమండ్రి పోలీసులు సాక్షి పత్రికపై కేసులు నమోదు చేశారని సమాచారం. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆమరణ దీక్ష చేసినపుడు ఆయన ఆరోగ్యం గురించి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లకు భిన్నంగా సాక్షిలో వార్తలు రాశారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/05/2016 - 13:53

విజయవాడ : ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సికిం ద్రాబాద్‌ - విజయవాడ ఇంటర్‌సిటీ ( నెంబర్‌ 12796 ) ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే స్వల్పంగా మార్పు చేసింది. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 10.08 గం టలకు గుంటూరు వచ్చి 10.10 గంటలకు విజయవాడ బయలుదేరి వెళుతోన్నది.

07/05/2016 - 11:58

శ్రీకాకుళం: పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు లోనై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామగ్రి కింద పడినట్లు పలువురు తెలిపారు. కాగా, నెలరోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

07/05/2016 - 07:38

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

07/05/2016 - 07:34

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రలో మిత్రపక్షమయిన తెదేపా-్భజపా మధ్య కలహాలు ముదురుపాకాన పడుతున్నాయి. విజయవాడలో 45 దేవాలయాల కూల్చివేత వ్యవహారం రెండు పక్షాల మధ్య దూరం మరింతగా పెంచింది. కూల్చివేతలపై సంఘ్ రంగంలోకి దిగడం, వందల సంఖ్యలో స్వాములు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేయడంతో రాగల ప్రమాదాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు, ఒకడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

07/05/2016 - 06:49

విజయవాడ, జూలై 4: విజయవాడలో రోడ్ల విస్తరణ పనుల పేరుతో అనేక ఆలయాలను తొలగించడం పట్ల హిందూ మత సంస్థలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుడుల కూల్చివేతను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు సోమవారం సమావేశమై చర్చించారు. వీరిలో ఒక బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

07/05/2016 - 06:47

విశాఖపట్నం, జూలై 4: ఇంధన పొదుపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని బ్రిక్స్ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విశాఖ హోటల్ తాజ్ గేట్‌వేలో సోమవారం అంతర్జాతీయ ఇంధన సదస్సు ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

07/05/2016 - 06:06

గుంటూరు, జూలై 4: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుండే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయ ప్రాంగణంలోని ఐదో బ్లాకులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లలో జరుగుతున్న అంతర్గత అలంకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

07/05/2016 - 06:03

విజయవాడ, జూలై 4: పుష్కరాలను పురస్కరించుకుని రోడ్ల విస్తరణ కోసం తొలగించిన ఆలయాలను శాస్త్రోక్తంగా తిరిగి నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో దేవాలయాల తొలగింపుపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో సిఎం సోమవారం స్వయంగా నగరంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు.

07/05/2016 - 06:03

హైదరాబాద్, జూలై 4: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్ధతి పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సింగపూర్ ప్రభుత్వం అధీనంలోని సింగపూర్ కన్సార్టియం సీడ్ క్యాపిటల్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్, అసెండాస్ కంపెనీలతోకూడిన కన్సార్టియంకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Pages