S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/28/2016 - 14:11

విజయవాడ : కృష్ణాజిల్లా వేములవాడలో రెండేళ్ల చిన్నారి అనన్య శునకాల దాడిలో మృతిచెందింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా శునకాలు ఒక్కసారిగి చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చనిపోయింది.

01/28/2016 - 11:59

తిరుమల: దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందడంతో తిరుమలలో పోలీసులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లో ఓ అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన పోలీసులు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల సానుభూతిపరుడిగా భావించి అరెస్టు చేసిన నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

01/28/2016 - 11:58

కడప: చిట్వేలు మండలం సిద్దారెడ్డిపల్లె వద్ద గురువారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించడంతో ఎనిమిదేళ్ల బాలిక అక్కడికక్కడే మరణించింది. ఇదే సంఘటనలో గాయపడిన ఓ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

01/28/2016 - 11:58

కర్నూలు: గడివేముల మండలం చిందుకూరులో నాలుగేళ్ల కుమార్తెకు విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికులు గమనించి వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెప్పారు.

01/28/2016 - 11:56

విజయవాడ: ఒడిసా నుంచి మహరాష్టక్రు ప్రతిరోజు వందల టన్నుల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న శివశంకర్‌రెడ్డి అనే నిందితుడు గురువారం ఉదయం ఇక్కడి ఇబ్రహీంపట్నం పోలీసుల వద్ద లొంగిపోయాడు. గంజాయిని నిల్వ చేసేందుకు విజయవాడలో పలుచోట్ల గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పోలీసులకు కీలక సమాచారం అందించాడు. నిందితుడి ఫోన్‌కాల్స్ డేటాను పరిశీలించి పోలీసులు నిఘా పెట్టారు.

01/28/2016 - 11:56

కడప: పులివెందుల నుంచి కర్ణాటక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. కర్ణాటకలోని గౌనిపల్లి వద్దకు బస్సు రాగానే మంటలు వ్యాపించాయి. అయితే మంటలను వెంటనే ఆర్పివేయడంతో సుమారు 60 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగాయని తెలిసింది.

01/28/2016 - 11:54

కడప: కడప జిల్లా జమ్మలమడుగు శివారులో గురువారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి ఓ వాహనంలో కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన ఈ ప్రాంతంలో బాంబులు దొరకడం కలకలం రేపింది.

01/28/2016 - 11:53

విశాఖ: నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేటు వద్ద బుధవారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్న ఐదుగురూ విదేశీ పర్యాటకులేనని, ఉగ్రవాద సంస్థలతో వారికి ఎలాంటి సంబంధాలు లేవని విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ గురువారం తెలిపారు. కారులో దిల్లీనుంచి బయల్దేరిన వీరు ఒడిశా మీదుగా విశాఖ జిల్లాకు చేరుకున్నారని, వీరి వద్ద పాస్‌పోర్టులు, వీసాలు సరైనవే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

01/27/2016 - 11:43

విశాఖ: యుద్ధ నౌకల విన్యాసాలు, అంతర్జాతీయ నగర కవాతు కార్యక్రమాల ప్రదర్శనకు విశాఖ సాగర తీరం ముస్తాబైంది. మూడు రోజులపాటు జరిగే ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రజలందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. ఇప్పటికే 1.5 లక్షల పాసులను మీ-సేవ కేంద్రం ద్వారా పంపిణీ చేశారు. పాసులు లేనివారు కూడా విన్యాసాలు తిలకించేందుకు అవకాశం కల్పించారు.

01/27/2016 - 11:42

విశాఖ: అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రాగల 48 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్రం నుంచీ వస్తున్న శీతగాలుల కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. రాయలసీమ, తెలంగాణల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుంది.

Pages