S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/31/2016 - 18:12

విశాఖపట్నం : తునిలో జరుగుతున్న కాపు సామాజికవర్గ కార్యకర్తల ఆందోళనకారంగా రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం విశాఖనుంచి బయలుదేరాల్సి ఉండగా నిలిపివేశారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టడంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి ఇప్పటికిప్పుడు మారే సూచనలు కన్పించడం లేదు.

01/31/2016 - 17:55

తుని : కాపు సామాజికవర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్యగర్జన హింస కు దారితీసింది. తుని రైల్వేస్టేషన్‌లో ఆగిఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మొదట ఇంజన్‌పై దాడి చేసినవారు ఆ తరువాత ఒక బోగీకి నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వరుసగా ఐదుబోగీలు దగ్ధమయ్యాయి.

01/31/2016 - 16:40

విశాఖపట్నం : ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పేరుతో విశాఖ నగరంలో అనేక సెంటర్లలో తోపుడు బండ్లు, చిల్లర వర్తకులను వ్యాపారాలు చేయనివ్వకుండా జివిఎంసి, పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై విశాఖపట్నం తోపుడుబండ్లు, చిల్లర వర్తకుల సంఘం నిరసన తెలియజేసింది. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌ను సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

01/31/2016 - 15:52

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాపు కులస్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి సర్కారు అమలు చేస్తుందని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఇప్పటికే కాపు కమిషన్, కాపు ఆర్థిక సహాయ సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చి, వారికి రిజర్వేషన్లు అమలు చేసేలా కృషి చేస్తామన్నారు.

01/31/2016 - 15:51

కాకినాడ: గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాపు కులస్థులను టిడిపి సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తుని వద్ద ఆదివారం జరిగిన కాపు ఐక్యగర్జనలో ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, వీరిని బిసి జాబితాలో చేర్చాలన్నారు.

01/31/2016 - 14:33

విజయనగరం: బొబ్బిలి పట్టణంలోని చిన్నబజారులో ఆదివారం ఉదయం పోలీసులు సోదాలు చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గెంబలి సత్తిరాజు, గెంబలి మహేష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వీరు భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు సామాగ్రిని కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు.

01/31/2016 - 14:33

గుంటూరు: వడ్లమూడి మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం రాత్రి హరిణి అనే 18 ఏళ్ల బయోటెక్నాలజీ విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ప్రేమ వైఫల్యం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సహచర విద్యార్థినులు చెబుతున్నారు.

01/30/2016 - 18:11

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఎస్.పి.టక్కర్ శనివారంనాడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఎల్‌బ్లాకులోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా ఆదివారంనాడు పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుకు సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది వీడ్కోలు పలికారు.

01/30/2016 - 17:11

తిరుపతి : శ్రీవారి లడ్డూ ధర పెంచాలన్న ఉప సంఘం ప్రతిపాదనను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరస్కరించింది. శనివారం తిరుపతిలో జరిగిన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్జిత సేవ టిక్కెట్ల ధర, లడ్డూల ధర పెంపు సిఫారసులపై నిర్ణయాన్ని వాయిదావేశారు. రూ.1.8 కోట్లతో మహామండప నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

01/30/2016 - 15:20

చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసులు ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. దిల్లీలో వికాస్ మెహందీ, కోల్‌కతలో మార్కొండ లక్ష్మణ్‌ను స్మగ్లింగ్ కేసులకు సంబంధించి అరెస్టు చేశారు. వీరిపై పిడి చట్టం కింద కేసులున్నట్లు తెలుస్తోంది.

Pages