S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/27/2016 - 11:41

అనంతపురం: ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి నర్సింహులు, తిరుపాల్ అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మరణించారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

01/27/2016 - 11:40

నెల్లూరు: కోవూరు మండలం పెళ్లకూరు కాలనీలో కోతుల బెడద అధికం కావడంతో పల్లవి అనే పదకొండేళ్ల బాలిక రెండంతస్థుల భవనం పై నుంచి కిందికి దూకేసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గాయపడిన బాలికను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పలు గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉందని స్థానికులు ఇదివరకే అధికారులకు ఫిర్యాదు చేశారు.

01/27/2016 - 11:40

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు ఓ ఇంట్లో వృద్ధ దంపతులను కత్తులతో బెదిరించి 13 కాసుల బంగారం, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. బుధవారం ఉదయం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

01/27/2016 - 11:40

విశాఖ: దళిత మహిళ అయిన తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజాపై కోటి రూపాయల మేరకు పరువు నష్టం దావా వేసినట్లు పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే వి.అనిత బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. రోజా వ్యాఖ్యలు తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర మనస్తాపానికి గురి చేసాయని అన్నారు. రోజాచేత క్షమాపణ చెప్పించేదాకా తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు.

01/26/2016 - 14:07

ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా కరంటు షాక్‌కు గురై ఇద్దరు రైతులు మరణించారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

01/26/2016 - 14:07

అనంతపురం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఈ జిల్లాలోని బండ్లపల్లిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. బండ్లపల్లిలో పర్యటించి రాహుల్ గాంధీ గ్రామస్థులతో మాట్లాడతారు.

01/26/2016 - 11:38

చిత్తూరు: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూడటంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టంకు తరలించారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

01/26/2016 - 11:36

విజయవాడ: కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లా పాతపాడుకు ఉప్పుటేరులో వెళ్తున్న పడవ మంగళవారం ఉదయం బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న మొత్తం 30 మంది క్షేమంగా ఒడ్డుకు చేరుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. పాతపాడు చేపల మార్కెట్‌కు వెళ్లే ప్రయాణీకులను పరిమితికి మించి పడవలో ఎక్కించటం వల్లే ఈ ఘటన జరిగింది.

01/25/2016 - 13:13

విశాఖప్నటం : విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. లంబసింగి, మినుమలూరులో 7 డిగ్రీలు, అరకులో 8 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

01/25/2016 - 12:08

విశాఖ: పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద ఓ కంపెనీ కార్యాలయంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.

Pages