S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/19/2016 - 11:45

కాకినాడ: రావులపాలెం మండలం గోపాలపురంలోని పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఆటోలలో సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

01/19/2016 - 11:44

విశాఖ: అనకాపల్లి పట్టణంలోని ఉడ్ పేట వద్ద సోమవారం అర్ధరాత్రి ఎస్‌బిఐ ఎటిఎంలో నగదు చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అలారం మోగడంతో దొంగలు పలాయనం చిత్తగించారు.

01/19/2016 - 11:44

విజయవాడ: ఇక్కడి శ్రీనివాస బ్యాంక్ కాలనీలో ఉంటున్న సబ్-రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఇంట్లో మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రులోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. దుర్గాప్రసాద్ భారీగా అక్రమాస్తులున్నట్లు ప్రాథమిక సమాచారం.

01/19/2016 - 11:43

నెల్లూరు: దుత్తలూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. ఈ ప్రాంతంలో గత మూడు నెలల వ్యవధిలో భూప్రకంపనలు రావడం ఇది పదోసారి. తాజాగా దుత్తలూరు, బోడవారిపల్లి, లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, బండకిందపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం ఉదయం 9.10 ని.లకు భూమి స్వల్పంగా కంపించటంతో జనం భయాందోళనకు లోనయ్యారు.

01/18/2016 - 17:09

తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని సోమవారం అరెస్ట్ చేయడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయనను సోమవారం నెల్లూరు కోర్టుకు తరలించగా... ఈ నెల 29 వరకు చెవిరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ...

01/18/2016 - 16:37

విశాఖపట్నం : విశాఖ నగరంలోని రామచందర్‌రావునగర్‌లో కమల (48), రవికుమార్ (30)అనే తల్లీకుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మానసిక స్థితి సరిగా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

01/18/2016 - 13:27

తిరుపతి ‌: నంది నాటకోత్సవాలు తిరుపతిలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు శివప్రసాద్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు.

01/16/2016 - 18:11

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం సాయంత్రం ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆమెను చంద్రబాబు స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగువారందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో టీడీపీలో చేరానని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని జయసుధ చెప్పారు.

01/16/2016 - 17:18

చిత్తూరు: విలువలతో కూడిన జీవితం గడపాలని..టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం నారావారిపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలన్నారు. నైపుణ్యం, సమర్థతతో ఏదైనా సాధించొచ్చని చెప్పారు.

01/16/2016 - 16:11

విశాఖపట్టణం: గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారని, వెంకయ్య, తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడి గీతం వర్సిటీలో ప్రారంభమైన గాంధీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన వెంకయ్య గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారన్నారు.

Pages