S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/14/2016 - 11:49

విజయవాడ: పెదపారపూడి మండలం వెంట్రప్రగడ వద్ద గురువారం ఉదయం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా, మిగతా ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు.

01/14/2016 - 11:49

ఒంగోలు: కారంచేడు వద్ద గురువారం ఉదయం ఓ గ్యాస్ గోడౌన్‌కు సమీపంలో ఆటో బోల్తా పడి ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఆటో అతివేగంగా వస్తున్నందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

01/14/2016 - 11:48

నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో గురువారం ఉదయం మళ్లీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బుధవారం సాయంత్రం కూడా స్వల్పంగా భూమి కంపించింది. గత కొద్దిరోజులుగా తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నందున జనం భయాందోళనకు లోనవుతున్నారు.

01/14/2016 - 11:48

నెల్లూరు: కలిగిరికి సమీపంలో గురువారం ఉదయం ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వీరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాలకొండయ్య, మాధవరెడ్డి బైక్‌పై భోగి సందర్భంగా మాంసం కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

01/14/2016 - 11:47

చిత్తూరు: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం తన వియ్యంకుడు, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆయన భోగి మంట వద్దకు వచ్చి చలి కాచుకున్నారు. బాలకృష్ణతో ఫొటోలు దిగేందుకు గ్రామ ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఆయన తిరుపతిలో ‘డిక్టేటర్’ సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరారు.

01/13/2016 - 18:14

నెల్లూరు: జిల్లాలోని వరికుంటపాడు మండలంలో బుధవారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. వరికుంటపాడు, జడదేవి, కడియంపాడు, నర్రవాడ, లక్ష్మీపురం, దాసరిపురం గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించడం ఈ నెలలో రెండో సారి.

01/13/2016 - 12:04

తిరుపతి: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శించుకొన్నారు. ఎ.పి. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుతోపాటు పలువురు ప్రముఖులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కాగా, సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

01/13/2016 - 12:04

శ్రీకాకుళం: రాజాం మండలం అంతకాపల్లిలో బుధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 15 ఇళ్లు దగ్ధం కాగా, మూడిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. 20 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

01/13/2016 - 12:02

చిత్తూరు: ఎర్రచందనం దొంగలు ఓ ఎస్సైపై దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగింది. టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా ఎర్రచందనాన్ని తీసుకెళ్తున్న లారీ ఓ ఇంటిని ఢీకొని ఆగిపోయింది. దొంగలు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు దొంగలు ఎస్సైపై దాడిచేసి గాయపరిచారు.

01/13/2016 - 12:02

విజయవాడ: ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు తమకు టిక్కెట్లు ఇవ్వకుండా బ్లాక్‌లో విక్రయించారని ఆరోపిస్తూ బుధవారం ఉదయం ఇక్కడి యువరాజ్ థియేటర్‌పై అభిమానులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Pages