S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/16/2016 - 16:09

అనంతపురం: జిల్లా అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడిని ఆయన అనంతపురం నగరంలో రోడ్డు విస్తరణ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో తనకు ఎలాంటి విభేదాలు లేవని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు

01/16/2016 - 14:11

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కొండశిఖరగూడలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌నెపంతో ఒకరిని హతమార్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

01/16/2016 - 14:07

ఆగిరిపల్లి: కృష్ణాజిల్లా కృష్ణవరంలో కోడిపందేల సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 10మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

01/16/2016 - 13:51

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగ సెలవులతో భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో 22 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం, కాలినడక భక్తులకు 6 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

01/16/2016 - 13:50

విశాఖ: మునగపాక మండలం కొండకర్లలో విషాదం అలముకుంది. జలపాతం దగ్గర నాటు పడవ బోల్తా పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. జలపాతం చూసేందుకు దంపతులు వచ్చారని స్థానికులు చెప్పారు. మృతులు తునికి చెందిన నర్సింహారావు దంపతులని పోలీసులు చెప్పారు.

01/16/2016 - 13:19

చిత్తూరు : చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు ఆట ప్రారంభం అయ్యింది. బహుమానంతో కూడిన పలకను ఎద్దు కొమ్ములకు కట్టి...వాటిని గ్రామస్తులు ఊరిపై వదలనున్నారు. ఎద్దులను లొంగదీసుకొని పలకల కోసం యువకులు పోటీపడనున్నారు. యువకులు జల్లికట్టు పేరుతో పశువులను హింసించవద్దని పోలీసుల నోటీసులు పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు చేశారు.

01/16/2016 - 13:08

రాజమండ్రి‌: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ తొలిమేయర్‌ ఎంఎస్‌ చక్రవర్తి(50) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. టీడీపీకి చెందిన చక్రవర్తి 2002 నుంచి 2006 వరకు రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు చక్రవర్తి మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

01/14/2016 - 13:24

ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెలం, జీలుగుమిల్లిలో ఇప్పటికే కోడిపందాలు ప్రారంభమైయ్యాయి. భీమవరంలో కోడి పందాలను బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. తణుకు మండలం తేతలిలో కోడిపందాలు జరిగాయి. పోలీసులు వారించినా నిర్వాహకులు పట్టించుకోలేదు. అత్యంత కోలాహలం మధ్య కోడిపందాలు సాగాయి.

01/14/2016 - 11:50

విజయవాడ: రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా సంక్రాంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకొని, ఆనందోత్సాహాలు పంచుకోవాలని ఎ.పి సి.ఎం. చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరియాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

01/14/2016 - 11:49

గుంటూరు: ఓ వర్గాన్ని కించపరిచే విధంగా ఏర్పాటైన ఫ్లెక్సీ సత్తెనపల్లి పట్టణంలో వివాదం రగిల్చింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్, టిడిపి నేత ఎ.నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పట్టణంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

Pages