S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/30/2015 - 07:23

వైకాపా అధికార ప్రతినిధి అంబటి ఆరోపణ

12/30/2015 - 07:22

ఆరుగురు జైలు అధికారులపై వేటు..సెలవుపై జైళ్ల సూపరింటెండెంట్

12/29/2015 - 16:23

విజయవాడ: కాల్ మనీ కేసును పక్కదోవ పట్టించేందుకు వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో కాల్ మనీ సెక్స్ రాకెట్ ను, ప్రైవేటు ఫైనాన్స్ ను ఒకేగాటన కట్టేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. వడ్డీల పేరుతో మహిళలను వేధించిన కీచకులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని నారాయణ ఆరోపించారు.

12/29/2015 - 16:13

విశాఖపట్నం :ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విశాఖ మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆనందరావు ఇంటిని జప్తు చేశారు.

12/29/2015 - 16:12

హైదరాబాద్ : విశాఖలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. విశాఖ కాల్‌గర్స్ పోర్టల్ నిర్వహిస్తూ ఈముఠా విటులను ఆకర్షిస్తోంది. ఈ ముఠాలోని నీలకంఠరెడ్డిని ద్వారకా నగర్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని శ్రావణి అనే ఏజెంట్‌ను, మరో ఇద్దరు యువతులన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

12/29/2015 - 16:12

అనంతపురం : రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కరవు నివారణ కార్యక్రమాలను చేపట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన అనంతపురం శ్రీనగర్‌ కాలనీలో నీరు-ప్రగతి రాష్టస్థ్రాయి సదస్సులో గవర్నర్ నరసింహాన్‌తో కలసి పాల్గొన్నారు.

12/29/2015 - 13:59

అమరావతి : నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. రూ.180 కోట్లతో జూన్ 30లోగా తాత్కాలిక సచివాలయాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

12/29/2015 - 13:31

విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరంలో తల్లి, కుమార్తె నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, కుమార్తె ల ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

12/29/2015 - 11:39

దిల్లీ: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఉగ్రవాదుల దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను తనిఖీ చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల్లోనూ భద్రతా చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి.

12/29/2015 - 11:39

అనంతపురం: ఎ.పిలో కాల్‌మనీ పేరిట సామాన్యులను, మహిళలను వేధింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి దేవినేని ఉప అన్నారు. కాల్‌మనీ కేసులపై వైకాపా చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వారైనా నిందితులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.

Pages