S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/25/2018 - 16:58

ముంబయ: దేశీయ స్టాక్ మార్కెట్లు మి శ్రమంగా ముగిశాయ. తొలుత స్వల్ప లాభాలతో ట్రేడ్ అయన మార్కెట్లు తదనంతరం సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయ. సెనె్సక్స్ ముందుకు, నిఫ్టి వెనక్కి తగ్గాయ. సెనె్సక్స్ 33 పాయంట్లు లాభపడి 36,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మాత్రం 2 పాయంట్ల నష్టంతో 11,132 వద్ద స్థిరపడింది.

07/25/2018 - 00:13

కిగలి: వేగంగా అభివృద్ధి చెందుతున్న తూర్పు ఆఫ్రికా దేశమయిన ర్వాండాతో వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ర్వాండా అభివృద్ధికి సహకరించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

07/24/2018 - 23:57

ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు మంగళవారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.

07/24/2018 - 23:54

న్యూఢిల్లీ, జూలై 24: కేంద్రంలో 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 80 శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో స్విస్ బ్యాంకులో 34.5 శాతం భారతీయుల డబ్బు నిల్వలు తగ్గాయని పేర్కొన్నారు.

07/24/2018 - 23:53

న్యూఢిల్లీ, జూలై 24: దేశంలోని కార్ల తయారీ కంపెనీలలో అతి పెద్దదయిన మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) బీఎస్ 6 ఉద్గారాలకు సంబంధించి మార్గదర్శకాలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందని ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం తెలిపారు. బీఎస్ 6 ఉద్గారాల మార్గదర్శకాలు 2020 ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. ఎంఎస్‌ఐ మంగళవారం తన నెక్సా కస్టమర్ల కోసం టెలిమాటిక్స్ సొల్యూషన్ ‘సుజుకి కనెక్ట్’ను ప్రారంభించింది.

07/24/2018 - 23:53

ముంబయి, జూలై 24: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆగస్టులో జరిపే తన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక పరిశోధనా విభాగం మంగళవారం అంచనా వేసింది. అయితే మెజారిటీ విశే్లషణా సంస్థలు వేసిన అంచనాకు ఇది భిన్నంగా ఉంది.

07/24/2018 - 02:16

విజయవాడ, జూలై 23: వర్తమాన టెలికాం మార్కెట్‌లో నెలకొని ఉన్న తీవ్ర పోటీని దృష్టిలో ఉంచుకుని సంవత్సరానికి రూ. 1099కే ‘ఇంటర్‌నెట్ పై వాయిస్’ సేవలను అందించే ఒక నూతన సేవను బీఎస్‌ఎన్‌ఎల్ ఆవిష్కరించింది. బీఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ అనే బ్రాండ్‌తో ఈ- టెలికాం సేవలను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ రావు సోమవారం నాడిక్కడ ఆవిష్కరించారు.

07/24/2018 - 02:10

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, శానిటరీ నాప్‌కిన్స్ వంటి 88 వినియోగ వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లపై తిరిగి సమీక్షించేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. అఖిల భారత వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన అఖిల భారత వర్తకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.

07/24/2018 - 00:50

హైదరాబాద్, జూలై 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ 60,845 కోట్లు ఆదాయపన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామ ప్రసాద్ చౌదరి వెల్లడించారు. సోమవారం ఉదయం ఆయన ఐటీ టవర్స్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పన్ను పరిధిలోకి కొత్తగా 10.13 లక్షల మంది చేరారని ఆయన చెప్పారు.

07/23/2018 - 23:28

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలు, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) వేసిన పిటిషన్‌ను ఎంబి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

Pages