S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/27/2017 - 00:56

ముంబయి, జూలై 26: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలను చేరుకున్నాయి. మంగళవారం చేజారిన 10 వేల పాయింట్ల రికార్డును నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ బుధవారం ట్రేడింగ్‌లో సొంతం చేసుకుంది. తొలిసారిగా నిఫ్టీ 10,000 పాయింట్ల ఎగువన ముగిసింది.

07/27/2017 - 00:56

న్యూఢిల్లీ, జూలై 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) మూలంగా వివిధ రాష్ట్రాలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే జిఎస్‌టి సమాఖ్యను ఏర్పాటు చేస్తానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్)కు హామీ ఇచ్చారు.

07/27/2017 - 00:55

తడ, జూలై 26: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడలో టాటా టొయో రేడియేటర్ లిమిటెడ్ ఉత్పత్తుల కేంద్రం వస్తోంది. టాటా ఆటో కాంప్ సిస్టమ్స్‌కు చెందిన ఈ సంస్థ.. వివిధ వాహనాల్లో వినియోగించే రేడియేటర్లను తయారు చేస్తుంది.

07/27/2017 - 00:55

న్యూఢిల్లీ, జూలై 26: ప్రైవేట్ రంగ సంస్థ, దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా క్షీణించి 2,734 కోట్ల రూపాయలుగా నమోదైంది.

07/27/2017 - 00:55

న్యూఢిల్లీ, జూలై 26: సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జిబి)లో వార్షిక పెట్టుబడుల పరిమితిని ఒక్కొక్కరికి 500 గ్రాముల నుంచి 4 కిలోలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. అంతేగాక కొనుగోలుదారులు, మదుపరులను ఆకర్షించేందుకు ఎస్‌జిబిని మరింత సరళతరం చేసింది. కాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత పెట్టుబడుల పరిమితిని 4 కిలోలకు పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు..

07/25/2017 - 20:12

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో మొత్తం ప్రభుత్వ వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి కొనేస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సిసిఇఎ) దీనికి సంబంధించి ఈ నెల 19న ఆమోదం తెలిపిందని లోక్‌సభకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలియజేశారు.

07/25/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 24: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. వచ్చే ఏడాది సాధ్యమైనంత త్వరలో భారతీయ మార్కెట్‌లోకి బిఎస్-6 మోడల్ వాహనాలను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ మేరకు మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ పిటిఐకి తెలిపారు. భారత్ స్టేజ్ (బిఎస్) 6 కర్బన ఉద్గారాల నిబంధనలతో వాహనాలను తీసుకొస్తారా? అన్నదానికి ఫోల్గర్ పైవిధంగా స్పష్టం చేశారు.

07/25/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) 23 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 10.02 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు లోక్‌సభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా మంత్రి చెప్పారు.

07/25/2017 - 00:32

భారీగా పెరిగిన ఐబిహెచ్‌ఎఫ్‌ఎల్ లాభం
న్యూఢిల్లీ, జూలై 24: ఐబిహెచ్‌ఎఫ్‌ఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25.7 శాతం పెరిగి 788.20 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 630.10 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,225 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,597.50 కోట్ల రూపాయలుగా ఉంది.

07/25/2017 - 00:32

విజయవాడ, జూలై 24: పాత పెద్ద నోట్ల రద్దు, కొత్త నిబంధనలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, తదితర కారణాలతో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. నవ్యాంధ్ర రాజధాని విషయానికే వస్తే.. పాత ప్రాజెక్ట్‌లు మినహా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు.

Pages