S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/31/2017 - 00:19

మరో 15 రోజుల్లో టమాట ధరలు తగ్గుముఖం పట్టే వీలుం దని భారతీయ వ్యవసాయ పరి శోధక మండలి (ఐసిఎఆర్) చెబు తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కె ట్‌లో కిలో టమాట ధర గరిష్ఠంగా 100 రూ పాయలు పలుకుతున్నది తెలిసిందే. అయతే కొత్త పంటల రాక పుంజుకోనుందని, ధరలు దిగివస్తాయని ఓ ఐసిఎఆర్ సీనియ ర్ అధికారి అంటున్నారు.

07/31/2017 - 00:15

విజయవాడ, జూలై 30: నవ్యాంధ్ర పర్యాటక శాఖకు మరో అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖకు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.

07/31/2017 - 00:13

న్యూఢిల్లీ, జూలై 30: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతు న్నాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 26,210 (4.1 బిలియన్ డాలర్లు) కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్లలోకి 7,611 కోట్ల రూపాయల (1.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులే రాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం 18,599 కోట్ల రూపాయల (2.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయ.

07/31/2017 - 00:12

చెనే్నకొత్తపల్లి, జూలై 30: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కియో కార్ల పరిశ్రమకు నవంబర్ నెలలో భూమిపూజ చేయనున్నట్లు నవ్యాంధ్ర రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంత్రి పరిటాల సునీతతో కలిసి దేవినేని ఉమా ఆదివారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

07/31/2017 - 00:11

న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో మొత్తం ప్రభుత్వ వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి అమ్మేస్తున్నది తెలిసిందే. అయతే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

07/31/2017 - 00:11

ముంబయి, జూలై 30: రిలయన్స్ జియో ప్రతిపాదిత 4జి ఫోన్ల నేపథ్యంలో ఐడియా సెల్యులార్ ఇంటర్నెట్ సమానత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సదరు ఫోన్‌లో జియోకు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయని, వినియోగదారులు కోరుకునే యాప్స్‌కు చోటుండకపోవచ్చని దీనివల్ల నెట్ న్యూట్రాలిటీకి భంగం వాటిల్లొచ్చని అంటోంది. కాగా, జియో 4జి ఫీచర్ ఫోన్‌కు ధీటుగా తాము కూడా ఓ ఫీచర్ ఫోన్‌ను తీసుకొస్తామని ఐడియా చెబుతోంది.

07/31/2017 - 00:10

న్యూఢిల్లీ, జూలై 30: రిలయన్స్ జియో దూకుడుకు బ్రేక్ వేస్తూ విద్యార్థులే లక్ష్యంగా సరికొత్త ఆఫర్లను వొడాఫోన్ ప్రకటించింది. ‘క్యాంపస్ సర్వైవల్ కిట్’ ఆఫర్ పేరిట 84 రోజులపాటు రోజుకు 1 జిబి 4జి లేదా 3జి డేటాతోసహా అపరిమిత కాల్స్‌ను 445 రూపాయలకే అందిస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ కూపన్స్, ఓ మెసేంజర్ బ్యాగ్ ఉచితమని తెలిపింది. కొత్త కనెక్షన్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందన్న వొడాఫోన్..

07/30/2017 - 01:23

న్యూఢిల్లీ, జూలై 29: పాత పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్ మార్కెట్‌పై అంచనాలు ఆకాశమే హద్దుగా వెళ్తున్నాయ. రద్దు తొలినాళ్లతో పోల్చితే ప్రస్తుతం నగదు లభ్యత పెరిగినప్పటికీ.. ఆన్‌లైన్ ఆధారిత కొనుగోళ్లకే వినియోగదారులు అలవాటు పడిపోయారంటే అతిశయోక్తి కాదు. నిరుడు నవంబర్ 8వ తేదీ 500, 1,000 రూపాయల నోట్లను మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే.

07/30/2017 - 01:22

న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌టిపిసి స్టాండలోన్ లాభం పన్ను చెల్లింపుల అనంతరం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12 శాతం పెరిగి 2,618 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 2,338.6 కోట్ల రూపాయలుగా ఉంది.

07/30/2017 - 01:21

న్యూఢిల్లీ, జూలై 29: మొండి బకాయల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 576.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 599.81 కోట్ల రూపాయలుగా ఉందని శనివారం తెలిపింది.

Pages