S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/30/2017 - 01:21

న్యూఢిల్లీ, జూలై 29: ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థల (ఎఆర్‌సి)కు దివాళా చట్టం (ఐబిసి) ఓ చక్కని అవకాశం అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఎఆర్‌సిలతోపాటు ప్రైవేట్ ఈక్వీటీ సంస్థ (పిఇ)లతో శనివారం చర్చల సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఈ నిరర్థక ఆస్తులన్నీ కూడా కీలకమని, ఇవి కేవలం అదనపు ఉద్యోగాలను సృష్టించడమేగాక, జాతీయ ఉత్పాదక శక్తిని కూడా పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

07/30/2017 - 01:18

హైదరాబాద్, జూలై 29: న్యాయ వ్యవస్థపైన విశ్వాసం పెరగాలంటే న్యాయవాదులు, కంపెనీ సెక్రటరీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కార్పొరేట్ కంపెనీల్లో ప్రతినిధులు, బీమా రంగ నిపుణులకు ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)పై అవగాహన, మెళకువలను పెంపొందించాల్సిన అవసరం ఉం దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు.

07/30/2017 - 01:15

హైదరాబాద్, జూలై 29: మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియో ఫోన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెలికాం రంగంలో ఫీచర్ ఫోన్ హ్యాండ్ సెట్‌లకు కొత్త ఊపిరినిచ్చే జియో ఫోన్ కోసం ఆగస్టు 24 నుంచి ఫ్రీ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. జియో ఫోన్ బుకింగ్‌ను వినియోగదారులు మై జియో ఆప్ ద్వారాగాని, ఆన్‌లైన్‌తోగాని, రిలయన్స్ జియో రిటైల్ స్టోర్ల ద్వారాగాని చేసుకోవచ్చని జియో సంస్థ తెలిపింది.

07/30/2017 - 01:13

హైదరాబాద్, జూలై 29: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 5వ అతిపెద్ద బ్యాంకైన యెస్ బ్యాంకుకు ఆర్థిక విభాగంలో ప్రతిషాఠత్మకమైన ఉత్తమ సృజనాత్మక అవాఠ్డు లభించింది. ఖాతాదారులకు విశిష్టమైన ఆర్థిక ఉత్పత్తులతో కూడా సేవలు, పథకాలు అందిస్తున్నందుకుగాను ఈ అవార్డు లభించినట్లు యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ తెలిపారు.

07/29/2017 - 00:54

ముంబయి, జూలై 28: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)కు ఈక్విటీ అమ్మకాలు కలిసొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సంస్థ లాభం గతంతో పోల్చితే ఏకంగా 145 శాతం ఎగిసింది. 6,100 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో కేవలం 2,489 కోట్ల రూపాయల నికర లాభానే్న అందుకుంది.

07/29/2017 - 00:53

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా లోక రాజేశ్వర రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సహకార సంఘాల రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ కమిషనర్, టిఎస్ సహకార ఎపెక్స్ బ్యాంకు, వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీవో 441ను జారీ చేసింది.

07/29/2017 - 00:52

ముంబయి, జూలై 28: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఈ నెలాఖర్లోగా టేకోవర్ చేయాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను శుక్రవారం కోరింది. సహారా గ్రూప్‌నకు చెందిన దీన్ని ఐఆర్‌డిఎఐ హస్థగతం చేసుకున్నది తెలిసిందే. దీని నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణం.

07/29/2017 - 00:52

న్యూఢిల్లీ, జూలై 28: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 46 శాతం ఎగిసి 893 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 610 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ శుక్రవారం తెలియజేసింది.

07/29/2017 - 00:50

భారీగా పెరిగిన ఐడిఎఫ్‌సి బ్యాంక్ లాభం

07/29/2017 - 00:49

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పెట్టుబడుల అవకాశాలు అనే సదస్సును ఎఫ్‌ట్యాప్సీ ఏర్పాటు చేసింది.

Pages