S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/25/2017 - 00:29

న్యూఢిల్లీ, జూలై 24: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం లభించింది. ఈ విలీనంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ ఏర్పడనున్నది తెలిసిందే. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద భారతీయ టెలికాం సంస్థగా ఉంది.

07/25/2017 - 00:28

న్యూఢిల్లీ, జూలై 24: పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘డీమానిటైజేషన్, జిఎస్‌టి వంటి చారిత్రక నిర్ణయాలకు ప్రజల నుంచి మునుపెన్నడూ లేనివిధంగా మద్దతును అందుకున్నాం.’ అని సోమవారం రాజస్థాన్‌కు చెందిన ఓ ఎంపీల బృందంతో మోదీ అన్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

07/25/2017 - 00:28

ముంబయి, జూలై 24: తమ జీవిత బీమా సంస్థల్లో ఏర్పడిన సంక్షోభం ఓ కొలిక్కి రావడానికి మరింత సమయం ఇవ్వాలని ఐఆర్‌డిఎఐని సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ సోమవారం కోరారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసులో రాయ్‌కి చెందిన రెండు సంస్థలను ఐఆర్‌డిఎఐ తమ అధీనంలోకి తీసుకున్నది తెలిసిందే.

07/25/2017 - 00:28

న్యూఢిల్లీ, జూలై 24: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.22 శాతం పెరిగి 3,893.84 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 3,238.91 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 22,185.38 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 19,322.63 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది.

07/25/2017 - 00:27

ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలు-2017 సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో అవార్డులను బహూకరిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. చిత్రంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ కూడా ఉన్నారు. పన్నుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఎవరు చేసినా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జైట్లీ ఘాటుగా హెచ్చరించారు

07/25/2017 - 00:25

ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ రెండూ కూడా నూతన శిఖరాలను అధిరోహించాయి.

07/24/2017 - 00:20

న్యూఢిల్లీ, జూలై 23: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

07/24/2017 - 00:18

న్యూఢిల్లీ, జూలై 23: దేశీయ రెండో అతిపెద్ద ఫాస్ఫటిక్ ఫర్టిలైజర్ తయారీదారు కోరమాండల్ ఇంటర్నేషనల్.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్దగల తమ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కావాల్సిన పర్యావరణ అనుమతులను పొందింది. వైజాగ్‌లోని శ్రీహరిపురం ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ 225 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

07/24/2017 - 00:17

విశాఖపట్నం, జూలై 23: సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగించే త్రిఫల షర్బత్ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) బ్రాండ్ ద్వారా వస్తున్న త్రిఫల షర్బత్.. కరక్కాయ, తానికాయ వంటి అటవీ ఉత్పత్తులతో తయారవుతోంది. ఈ నెల 26వ తేదీన దీన్ని ఆంధ్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభిస్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని మార్కెటింగ్ చేస్తారు.

07/24/2017 - 00:17

పెరిగిన పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాభం
న్యూఢిల్లీ, జూలై 23: పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 75 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016- 17) ఏప్రిల్-జూన్‌లో ఇది 73.28 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 728 కోట్ల రూపాయలుగా, పోయినసారి 701.77 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages