S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/28/2017 - 00:36

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 3.5 శాతం పెరిగి 2,604.73 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో బ్యాంక్ లాభం 2,515.85 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం ఐసిఐసిఐ వర్గాలు స్పష్టం చేశాయి.

07/28/2017 - 00:34

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 4 శాతానికిపైగా పుంజుకుని 1,556.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 1,490.9 కోట్ల రూపాయలుగా ఉందని మారుతి సుజుకి ఇండియా (ఎమ్‌ఎస్‌ఐ) గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

07/28/2017 - 00:34

హైదరాబాద్, జూలై 27: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యాప్సీ) వైస్ ప్రెసిడెంట్‌గా పారిశ్రామికవేత్త కరుణేంద్ర ఎస్ జాస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఇక్కడ ఫెడరేషన్ హౌస్‌లో జరిగిన చాంబర్ సమావేశంలో కరుణేంద్రను ఎన్నుకున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

07/28/2017 - 00:33

ముంబయి, జూలై 27: బుధవారం ముగింపుతో చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం యథాతథంగానే ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా 0.84 పాయింట్లు పెరిగి 32,383.30 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 0.10 పాయింట్లు పడిపోయి 10,020.55 వద్ద నిలిచింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 32,672.66 పాయింట్లను తాకగా, నిఫ్టీ 10,114.85 పాయింట్ల స్థాయిని అందుకుంది.

07/28/2017 - 00:33

హైదరాబాద్, జూలై 27: ఉత్తర తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఐటి సర్వీసుల రంగం వరంగల్‌లో, బిపివోల విభాగం నిజామాబాద్, కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక ఖరారు చేసింది. ఈ ప్రణాళికను సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) రూపొందించింది.

07/28/2017 - 00:32

హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ నగర కేంద్రంగా పనిచేస్తున్న పెగా సిస్టమ్స్ తన కార్యాలయాన్ని పెద్దఎత్తున విస్తరించింది. ప్రశాంత వాతావరణంలో సిబ్బంది పని చేసేందుకు, పని బృందాలు ఒకటిగా పని చేసేందుకు వీలుగా విశాలమైన కొత్త అంతస్తును తయారు చేసింది. హైటెక్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్ ఐటి పార్క్‌లోని 11వ అంతస్తులో కార్యాలయాన్ని విస్తరించినట్లు కంపెనీ ప్రకటించింది.

07/28/2017 - 00:30

ఔషధ రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 53 శాతం క్షీణించి 59.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 126.3 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం సంస్థ తెలిపింది.

07/28/2017 - 00:29

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 815.9 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 217.1 కోట్ల రూపాయల లాభాన్ని ఐడియా అందుకుంది. ఆదాయం కూడా ఈసారి దాదాపు 14 శాతం క్షీణించి 8,181.7 కోట్ల రూపాయలకు పరిమితమైంది.

07/28/2017 - 00:27

న్యూయార్క్, జూలై 27: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ యజమాని జెఫ్ బెజోస్.. ప్రపంచ సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 2013 నుంచి 61 ఏళ్ల బిల్‌గేట్స్ తొలి స్థానంలోనే ఉంటుండగా, ఈ ఏడాది మాత్రం 53 ఏళ్ల జెఫ్ బెజోస్ ఆ స్థానంలోకి వచ్చినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గురువారం తెలిపింది.

07/28/2017 - 00:25

విశాఖపట్నం, జూలై 27: నవ్యాంధ్ర రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు నష్టాల బాట పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలకు రావల్సిన రాయితీలు రాకపోగా, విద్యుత్ ఛార్జీలు ఐటి కంపెనీలకు భారంగా పరిణమిస్తున్నాయి. తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా.. ఒక యూనిట్‌ను 9.50 నుంచి 10 రూపాయలతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

Pages