S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/01/2016 - 06:53

విజయవాడ, నవంబర్ 30: అమరావతి రాజధాని నగర పరిధిలో పెట్టుబడులకు అపూర్వ అవకాశాలున్నాయని ఏపిసిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. ఫ్రెంచ్ డెలిగేషన్ బృందంతో విజయవాడలో బుధవారం జరిగిన సదస్సులో కమిషనర్ ప్రాజెక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపిసిఆర్‌డిఏ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి అయన చంద్రబాబు నాయుడు విజన్‌తో అమరావతి అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోందన్నారు.

12/01/2016 - 06:53

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 7.3 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్‌లో ఇది 7.1 శాతానికే పరిమితమవగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 7.6 శాతంగా నమోదైంది. ఈ మేరకు బుధవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) తెలిపింది. ఆర్థిక వృద్ధిరేటులో నిరుడు చైనాను అధిగమించిన భారత్..

11/30/2016 - 00:39

ముంబయి, నవంబర్ 29: ఒడిదుడుకుల ట్రేడింగ్ మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆటో, టెలికామ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఇండస్ట్రియల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.84 పాయింట్లు పెరిగి 26,394.01 వద్ద స్థిరపడగా, రెండు వారాలకుపైగా గరిష్ఠాన్ని తాకింది.

11/30/2016 - 00:36

న్యూఢిల్లీ, నవంబర్ 29: రద్దయిన 500, 1,000 రూపాయల నోట్ల మార్పిడికిగాను చేసే డిపాజిట్లకున్న గడువును పెంచే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలిసిందే.

11/30/2016 - 00:32

న్యూఢిల్లీ, నవంబర్ 29: టాటా పవర్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 336.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 95.8 కోట్ల రూపాయల ఏకీకృత నికర నష్టాలను చవిచూసింది. ఆదాయం ఈసారి 7,208.8 కోట్ల రూపాయలుగా, పోయినసారి 7,666.3 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం ప్రకటించింది.

11/30/2016 - 00:31

న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) భారీగా పెరిగింది. ఏకంగా ఆరింతలు ఎగిసి 3,855 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇది కేవలం 672 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 2015-16 ఆర్థిక సంవత్సరంలో గతంతో పోల్చితే 4.4 శాతం పెరిగి 28,449 కోట్ల రూపాయలుగా నమోదైంది.

11/30/2016 - 00:31

హైదరాబాద్, నవంబర్ 29: రియల్ ఎస్టేట్ రంగంలో యోగత్యలేని రియల్టర్లపై మాత్రమే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని, వాస్తవానికి హైదరాబాద్‌లో కేంద్రం నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగం బలోపేతమవుతుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషనన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వ్యాఖ్యానిం చింది.

11/30/2016 - 00:28

విజయవాడ, నవంబర్ 29: సాధారణంగా వార్షిక బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు, మూడు మాసాల ముందుగానే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పేరిట ట్రెజరీలలో బిల్లుల చెల్లింపులపై రోజుకో విధమైన ఆంక్షలు విధించడం చూస్తుంటాం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు భర్తీపై కేంద్రం మీన మేషాలు లెక్కిస్తున్నది.

11/30/2016 - 00:26

నిజామాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దుతో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమలోనూ అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయని స్పష్టమవుతోంది. బీడీ పరిశ్రమ స్థాపించిన నాటి నుండే గడిచిన కొన్ని దశాబ్దాల కాలంగా కార్మికులకు నగదు రూపంలో నేరుగా వేతనాలు చెల్లిస్తుండగా, మారిన పరిస్థితుల దృష్ట్యా ఇకపై వారి వేతనాలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని బీడీ కంపెనీల యాజమాన్యాలు యోచిస్తున్నాయి.

11/30/2016 - 00:24

విజయవాడ, నవంబర్ 29: బడా బాబుల వద్ద ఏళ్ల తరబడి మూలుగుతున్న నల్లధనాన్ని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతటి వ్యూహాన్ని పన్నుతున్నప్పటికీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా నల్ల కుబేరులు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో పావులు కదుపుతున్నారు. తొలి రోజుల్లో అమాయకులకు, రోజువారీ కూలీలను బ్యాంకుల్లో నిలబెట్టి కోట్లాది రూపాయల నల్లధనాన్ని మార్చుకున్నారు.

Pages