S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/23/2016 - 01:58

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఫ్రెంచి ఆటో దిగ్గజం రెనాల్ట్ సరికొత్త వెర్షన్‌లో తన చిన్న కారు ‘క్విడ్’ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతీ సుజుకీ సంస్థకు చెందిన ఆల్టో కె-10 మోడల్‌కు పోటీగా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించిన ఈ కారు గరిష్ఠ ధరను (్ఢల్లీ ఎక్స్-షోరూమ్ ధరను) రూ.3.95 లక్షలుగా నిర్ణయించారు.

08/23/2016 - 01:56

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్‌లో తమ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గత రెండేళ్లలో 72 శాతానికి పెరిగాయని చైనా టెక్ దిగ్గజం షియోమీ సోమవారం ప్రకటించింది. రెండేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ సంస్థ ప్రధానంగా ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని అమ్మకాలను సాగిస్తున్న విషయం తెలిసిందే. ‘2014 జూలైలో భారత్‌లో ప్రవేశించిన మేము అత్యంత నాణ్యమైన హ్యాండ్‌సెట్లతో స్మార్ట్ఫోన్ పరిశ్రమలో సంచలనం సృష్టించాం.

08/22/2016 - 08:15

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఆర్‌బిఐ నూతన గవర్నర్ నియామకోత్సాహం కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా.. డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం ఎంపిక చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచవచ్చని, దీంతో సూచీలు లాభాల్లో పరుగులు పెట్టవచ్చని విశే్లషకులు అంటున్నారు.

08/22/2016 - 08:13

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉర్జిత్ పటేల్‌కున్న అనుభవం, అద్భుతమైన పనితనం, మేధోశక్తి.. గవర్నర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ను నడిపించడంలో ఆయనకు దోహదం చేస్తాయని నిపుణులు, ప్రముఖ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. సవాళ్ల సమయంలో పటేల్ కేంద్ర బ్యాంక్ అధిపతిగా నియమితులయ్యారని, అయితే అన్నింటినీ ఎదుర్కొని విజయవంతంగా ముందుకెళ్లగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.

08/22/2016 - 08:12

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మి.. తమ వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. దీంతో 4,000 మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. మరోవైపు ఆస్క్‌మిలో మెజారిటీ మదుపరి అయిన ఆస్ట్రో.. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిపిస్తామని, ఆర్థిక లావాదేవీలను సమీక్షిస్తామని తెలిపింది. గెటిట్‌కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన్ ఆస్క్‌మి..

08/22/2016 - 08:12

న్యూఢిల్లీ, ఆగస్టు 21: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 7,700 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొ చ్చారు.

08/22/2016 - 08:11

సంగారెడ్డి, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగరీథ పథకం పనులు బిఎస్‌ఎన్‌ఎల్ పాలిట శాపంగా పరిణమిస్తున్నాయ. భగీరథ పైపులైన్ల నిర్మాణం కోసం జెసిబిలతో తవ్వుతున్న కాలువల వల్ల బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్స్ ఎక్కడికక్కడే ముక్కల వుతున్నాయి. దీంతో బిఎస్‌ఎన్‌ఎల్‌కు కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టమే కాకుండా, సేవలు నిలిచిపోయ ఆదాయ నష్టం కూడా వాటిల్లుతోంది.

08/21/2016 - 01:18

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్‌గా సునీల్ భారతీ మిట్టల్ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండనుండగా, ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నూతన పదవీకాలం మొదలవుతుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. మిట్టల్.. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడన్నది తెలిసిందే.

08/21/2016 - 01:18

న్యూఢిల్లీ: ‘ఆర్‌బిఐ తదుపరి గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. స్పష్టమైన అభిప్రాయాలున్న పటేల్.. తన నిర్ణయాలతో మంచి మార్పులకు నాంది పలుకుతారు’.
- ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్ర
‘ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం. పటేల్ ఎంపికతో అటు ఆర్‌బిఐ, ఇటు ప్రభుత్వంలో సంస్కరణాత్మక నిర్ణయాలు కొనసాగుతాయన్న సంకేతాలిచ్చినట్లైంది’.

08/21/2016 - 05:58

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ శనివారం నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలానికిగాను సెప్టెంబర్ 4న పటేల్ బాధ్యతలు స్వీకరించనుండగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు, బ్రెగ్జిట్ ప్రభావం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

Pages