S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/27/2016 - 06:01

న్యూఢిల్లీ, ఆగస్టు 26: టెలికామ్ సంస్థలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్.. వచ్చే నెల తొలి వారంలో విలీన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ‘ఇరు సంస్థల మధ్య టర్మ్ షీట్ తుది రూపుకొచ్చింది. మరో వారం లేదా 10 రోజుల్లో విలీన ఒప్పందం జరుగుతుంది.’ అని టెలికామ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

08/27/2016 - 06:00

ముంబయి, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 53.66 పాయింట్లు పడిపోయి 27,782.25 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.65 పాయింట్లు కోల్పోయి 8,572.55 వద్ద నిలిచింది.

08/27/2016 - 05:59

న్యూఢిల్లీ, ఆగస్టు 26: వెండి ధరలు భారీగా పడిపోయాయి. శుక్రవారం బులియన్ ట్రేడింగ్‌లో కిలో ధర 650 రూపాయలకుపైగా పతనమైంది. బంగారం ధర కూడా దిగజారింది. రెండు రోజులపాటు ధరలు పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య ధరలు క్షీణించాయి. ఈ క్రమంలోనే క్రితం ముగింపుతో పోల్చితే కిలో వెండి ధర 655 రూపాయలు దిగి 44,420 రూపాయల వద్దకు వచ్చింది.

08/27/2016 - 05:58

ముంబయి, ఆగస్టు 26: ద్రవ్యోల్బణంపై పోరును ఉర్జిత్ పటేల్ కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు. వచ్చే నెల 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుండగా, ఆ స్థానంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నది తెలిసిందే.

08/27/2016 - 05:57

ముంబయి, ఆగస్టు 26: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే భారీగా క్షీణించింది. 57 శాతం పతనమై 2,260.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం 5,254.23 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది.

08/26/2016 - 16:34

దిల్లీ: బులియన్‌ మార్కెట్లో శుక్రవారం వెండి ధర బాగా తగ్గి రూ.45వేల దిగువకు పడిపోయింది. పది గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ.31,150కి చేరింది. కేజీ వెండి రూ.655 తగ్గి రూ.44,420కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో పాటు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో బంగారం ధర తగ్గిపోయింది.

08/26/2016 - 16:23

ముంబయి: ఈరోజు కూడా నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ముగిశాయి. ప్రారంభంలో సానుకూలంగా ఉన్న సూచీలు ముగింపు సమయానికి నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.03 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 54 పాయింట్లు నష్టపోయి 27,782 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నేడు కూడా 8600 పాయింట్లకు దిగువలోనే ఉంది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 8,573 పాయింట్ల వద్ద ముగిసింది.

08/26/2016 - 01:46

న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలో అతి పెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) తన వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేసే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది. బోనస్ షేర్ల జారీ అంశాన్ని పరిశీలించడం కోసం ఐఓసి బోర్డు ఈ నెల 29న సమావేశమవుతుందని ఆ సంస్థ మార్కెట్ రెగ్యులేటరీ అయిన సెబికి పంపిన ఓ లేఖలో తెలిపింది.

08/26/2016 - 01:45

విశాఖపట్నం, ఆగస్టు 25: విశాఖ నగరంలో రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన భూగర్భ విద్యుదీకరణ ప్రాజెక్టు నిర్మాణాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఇపిడిసిఎల్) ప్రతినిధి బృందం దేశంలో పలు రాష్ట్రాల్లో పూర్తయిన ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

08/26/2016 - 01:44

న్యూఢిల్లీ, ఆగస్టు 25: సూపర్ బైక్‌ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందిన ఇటలీ సంస్థ ‘డుకాటీ’ తన సరికొత్త మల్టీస్ట్రాడా 1200 ఎండ్యూరో మోడల్ బైక్‌ను గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 17.44 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

Pages