S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/19/2016 - 01:57

కాకినాడ, ఆగస్టు 18: ఆఫ్‌షోర్ వ్యాపార ప్రాజెక్టుల విస్తరణ ద్వారా క్షేత్ర కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి సన్నాహాలు చేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ (కాకినాడ) ఆధ్వర్యంలో చమురు, సహజవాయు నిక్షేపాల అనే్వషణకు ఈ సంస్థ చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకు తూర్పు కోస్తాలో డీప్ వాటర్ అభివృద్ధి ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది.

08/19/2016 - 01:55

హైదరాబాద్, ఆగస్టు 18: అంతర్జాతీయంగా ఓనీ చానల్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేసిన ఎన్‌సిఆర్ కార్పోరేషన్‌ను వచ్చే ఏడాది హైటెక్ సిటీలో రహేజా మైండ్‌స్పేస్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఇ రోస్నర్ ప్రకటించారు. అంతర్జాతీయంగా గ్లోబల్ సెంటర్‌గా ఎన్‌సిఆర్‌ను తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. పరిశోధన, సృజనాత్మకత, డిజైన్ తదితర రంగాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

08/18/2016 - 00:52

ఆహార ద్రవ్యోల్బణం గత నెల జూలైలో భారీగా ఎగిసింది.
జూన్‌తో పోల్చితే 3.64 శాతం పెరిగి 11.82 శాతాన్ని తాకింది. ఉల్లిగడ్డ మినహా మిగతా అన్ని ప్రధాన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. బంగాళదుంప ధర అత్యధికంగా 58.78 శాతం ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణాలు జూలైలో పెరగడానికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణమేనన్నది తెలిసిందే

08/18/2016 - 00:49

ముంబయి, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 59.24 పాయింట్లు క్షీణించి 28,005.37 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.50 పాయింట్లు దిగజారి 8,624.05 వద్ద నిలిచింది.

08/18/2016 - 00:48

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. బుధవారం తమ 3జి, 4జి వినియోగదారుల కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘కాలింగ్ కా నయా తరీకా’ అనే పేరుతో పరిచయమైన ఈ పథకంతో మొబైల్ అప్లికేషన్స్ (యాప్) నుంచి చేసే కాల్స్ 95 శాతం చౌక అవుతాయని సంస్థ తెలియజేసింది. 200 మెగాబైట్ 4జి డేటా ధర 39 రూపాయలని వెల్లడించింది.

08/18/2016 - 00:48

సాన్ జోస్ (కాలిఫోర్నియా), ఆగస్టు 17: అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ సంస్థ సిస్కో సిస్టమ్స్.. భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా సుమారు 14,000 మందిని తీసేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్కో ఉద్యోగుల్లో దాదాపు 20 శాతానికి ఇది సమానం. ఈ ఏప్రిల్ 30 నాటికి సిస్కో ఉద్యోగుల సంఖ్య 70,000గా ఉంది.

08/18/2016 - 00:46

హైదరాబాద్, ఆగస్టు 17: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన ఈ విషయమై తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌బిహెచ్‌కు ఘనమైన చరిత్ర ఉందని, నిజాం కాలం నుంచి ఈ బ్యాంకు అద్భుతమైన సేవలను అందిస్తోందని తెలిపారు.

08/18/2016 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రవాణా యాప్ ఓలా.. టాక్సీఫర్‌ష్యూర్ (టిఎఫ్‌ఎస్) వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించుకుంది. దాదాపు 18 నెలల క్రితం 200 మిలియన్ డాలర్ల (సుమారు 1,300 కోట్ల రూపాయలు)తో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా కొనుగోలు చేసింది. ప్రధాన ప్రత్యర్థి ఉబర్‌కు దేశీయ మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వాలనుకునే లక్ష్యంలో భాగంగా 2015 మార్చిలో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా సొంతం చేసుకుంది.

08/18/2016 - 00:43

న్యూఢిల్లీ, ఆగస్టు 17: లిక్కర్ తయారీ సంస్థ రాడికో ఖైతాన్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25.2 శాతం పెరిగి 21.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 17.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి నిరుడుతో పోల్చితే 3.1 శాతం పెరిగింది. 430.4 కోట్ల రూపాయలుగా ఉంది.

08/18/2016 - 00:43

న్యూఢిల్లీ, ఆగస్టు 17: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్‌డయల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 7.98 శాతం పెరిగి 38.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ నికర లాభం 36.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా నిరుడుతో పోల్చితే 6.17 శాతం ఎగిసి ఈసారి 176.29 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఇది 166.03 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages