S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/20/2016 - 05:45

న్యూఢిల్లీ, ఆగస్టు 19: మీడియారంగ సంస్థ సన్ టెలివిజన్ నెట్‌వర్క్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 19 శాతం పెరిగి 233.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 195.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 760.8 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 689.5 కోట్ల రూపాయలుగా ఉంది.

08/20/2016 - 05:44

న్యూఢిల్లీ, ఆగస్టు 19: టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్ చెల్లుబాటు గడువును పొడిగించింది. ప్రస్తుతం గరిష్ఠంగా 90 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతున్న ఈ ప్యాక్‌లు.. ఇకపై 365 రోజులపాటు (సంవత్సరం) చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు శుక్రవారం ట్రాయ్ అనుమతిచ్చింది.

08/19/2016 - 02:09

ముంబయి, ఆగస్టు 18: వరసగా రెండు రోజులు నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తెరదించిన కొద్ది క్షణాలకే రిటైల్, సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు తిరిగి లాభాల్లో పరుగులు పెట్టాయి.

08/19/2016 - 02:07

విశాఖపట్నం, ఆగస్టు 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో 8500 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

08/19/2016 - 02:05

న్యూఢిల్లీ, ఆగస్టు 18: భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబిఎల్)తో పాటు మరో మూడు అనుబంధ బ్యాంకుల విలీనానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) డైరెక్టర్ల బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఎస్‌బిఐ పరిమాణం అంతర్జాతీయ స్థాయికి పెరుగుతుంది.

08/19/2016 - 02:04

వడోదర, ఆగస్టు 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన వివిధ కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతున్నారు. ‘దేశంలో బ్యాంకింగ్ పరిశ్రమపై దాడులు పెరుగుతున్నాయి.

08/19/2016 - 02:02

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రధాని మోదీతో సమావేశమై దాదాపు గంటసేపు సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రఘురామ్ రాజన్ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో జైట్లీ గురువారం ప్రధానితో సమావేశమయ్యారు.

08/19/2016 - 02:01

విశాఖపట్నం, ఆగస్టు 18: విశాఖలో నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్టు రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. రెండు రోజుల పాటు జాతీయ రహదారి భద్రతపై జరిగే వర్క్‌షాప్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గురువారం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాతూ ట్రాన్స్‌పోర్ట్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదనలు కేంద్రానికి నివేదించినట్టు తెలిపారు.

08/19/2016 - 02:00

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆర్‌బిఎల్ బ్యాంక్ శుక్రవారం తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ)తో మార్కెట్లోకి రానుంది. 1200 కోట్ల రూపాయలకుపైగా నిధుల సమీకరణ కోసం బ్యాంక్ పబ్లిక్ ఇష్యూకు వెళ్తోంది. గత పదేళ్లలో ఒక ప్రైవేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ఇదే మొదటి సారి. తాజాగా షేర్లు జారీ చేయడం ద్వారా రూ 832.50 కోట్లు, ఇప్పుడున్న వాటాదారులకు షేర్లుజారీ చేయడం ద్వారా మరో రూ.

08/19/2016 - 01:59

హైదరాబాద్, ఆగస్టు 18: సుల్తాన్‌పూర్‌లో మొదటి దశగా వంద ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్‌ను, రెండవ దశలో మూడు నుంచి ఐదువందల ఎకరాల్లో నిమ్జ్‌లో ప్లాస్టిక్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

Pages