S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/21/2016 - 01:14

హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్ సైక్లింగ్ ప్రియులకు ప్రపంచస్థాయి సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఓ అత్యాధునిక సైకిల్ షోరూం ‘బైక్ స్టూడియో’ ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం 12లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎదురుగా ఈ షోరూంను తెరిచారు.

08/21/2016 - 05:57

ముంబయి, ఆగస్టు 20: పన్ను ఎగవేతలున్నప్పుడు తక్కువ పన్నుల విధానం సరిపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పన్నుల రేట్లు తగ్గాలంటే అందరూ పన్నులు చెల్లించాలని, అప్పుడే పన్నులను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటుపై ఊహాగానాల మధ్య జైట్లీ పైవిధంగా స్పందించారు.

08/20/2016 - 17:59

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుండడంతో ఈరోజు కొత్త గవర్నర్ పేరును ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మొదట్లో చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినా చివరికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్, ప్రస్తుత గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లు నిలిచాయి. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

08/20/2016 - 15:52

దిల్లీ: ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల పసిడి ధర రూ.31,250గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధర రూ.46వేల మార్కు దిగువకు పడిపోయింది. నేటి బులియన్‌ మార్కెట్లో వెండి కేజీకి రూ.490 తగ్గి రూ.45,975కు చేరింది.

08/20/2016 - 05:50

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఆర్‌బిఎల్ బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) తొలిరోజు 66 శాతం బిడ్లను అందుకుంది. దశాబ్దకాలంలో ఓ ప్రైవేట్‌రంగ బ్యాంకు ఐపిఒకు రావడం ఇదే తొలిసారి అవగా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చివరిసారిగా 2005లో యెస్ బ్యాంక్ ఐపిఒ వచ్చింది.

08/20/2016 - 05:47

ముంబయి, ఆగస్టు 19: సేవా పన్ను శాఖ మరోసారి లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ప్రైవేట్ జెట్‌ను వేలం వేసే అవకాశాలున్నాయి.

08/20/2016 - 05:47

హైదరాబాద్, ఆగస్టు 19: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లీఎకో సూపర్ 3 సిరీస్ ఎకోసిస్టమ్ టీవీలను మార్కెట్ కు పరిచయం చేసింది. శుక్రవారం తాజ్ బంజారా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ ఉత్పాదక అధిపతి గౌతమ్ వీటి విశిష్టతలను వివరించారు. భారత వినియోగదారులకు టీవీ వీక్షణంలో సరికొత్త నిర్వచనం చెప్పే విధంగా తమ 3 సిరీస్ టెలివిజన్లు ఉంటాయని అన్నారు.

08/20/2016 - 05:46

న్యూఢిల్లీ, ఆగస్టు 19: సహారా కేసులో మదుపరుల నుంచి దాదాపు 12,000 రిఫండ్ దరఖాస్తులను అందుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం తెలిపింది. 36,415 డిపాజిట్ అకౌంట్లకు సంబంధించి 11,956 అప్లికేషన్లు వచ్చాయని చెప్పింది. ఈ క్రమంలో దాదాపు 31.7 కోట్ల రూపాయల అసలుతోపాటు 24.01 కోట్ల రూపాయలకుపైగా వడ్డీతో మొత్తం 55.72 కోట్ల రూపాయలను రిఫండ్ చేసినట్లు స్పష్టం చేసింది.

08/20/2016 - 05:46

న్యూఢిల్లీ, ఆగస్టు 19: త్వరలో తమ టెలికామ్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్న రిలయన్స్ జియో.. సామ్‌సంగ్, ఎల్‌జి 4జి స్మార్ట్ఫోన్లపైనా తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సిగ్నల్ టెస్టింగ్‌లో ఉన్న రిలయన్స్ జియో.. ఇప్పటిదాకా తమ నెట్‌వర్క్ సేవలను సొంత ఎల్‌వైఎఫ్ మొబైల్స్ వినియోగదారులకే అందిస్తూ వచ్చింది.

08/20/2016 - 05:45

ముంబయి, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాలపాలయ్యాయి. గురువారం లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల అమ్మకాల మధ్య మరోసారి నష్టాలు తప్పలేదు. ఐరోపా మార్కెట్లు పతనం కావడం, ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ స్పందనలు రావడం వంటివి దేశీయ సూచీలను ప్రభావితం చేశాయి.

Pages