S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/18/2016 - 00:42

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రుణాలు తీసుకున్నవారు వాటిని చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా ఆ రుణాల కోసం జామీనుగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు తెలిపారు. అయితే వ్యవసాయ రుణాలకు ఇది వర్తించదు. అలాగే విద్యార్థుల రుణాలకూ చెల్లదు.

08/18/2016 - 00:40

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: చంద్రన్న బీమా పథకంలో నమోదైన అసంఘటిత కార్మికులకు అదనపు ప్రయోజనాలు వర్తించనున్నాయని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ డి వరప్రసాద్ తెలిపారు. అసంఘటిత రంగంలోని రెండు కోట్ల మంది కార్మికుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంలో ప్రథమ ప్రీమియం రూ. 139 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

08/18/2016 - 00:39

గుంటూరు, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 సీజన్‌కు సంబంధించి 130 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేసేందుకు పొగాకుబోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో బోర్డు చైర్మన్ మనోజ్‌కుమార్ ద్వివేది అధ్యక్షతన 142వ పొగాకు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు సభ్యులు, ఎంపిలు గల్లా జయదేవ్, లాల్‌సింగ్ వదోడియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎపి) విజయకుమార్ తదితరులు హాజరయ్యారు.

08/18/2016 - 00:37

న్యూఢిల్లీ : బుధవారం న్యూఢిల్లీలో హువావీ పి9 స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న బాలీవుడ్ నటి సుస్మితా సేన్. దీని ధర 39,999 రూపాయలు. ఈకామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది

08/18/2016 - 00:35

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. తమ టియాగో కారు ధరను పెంచింది. వివిధ మోడళ్ల ఆధారంగా కనిష్టంగా 5,000 రూపాయల నుంచి గరిష్ఠంగా 60,000 రూపాయల వరకు ధరలు పెరిగాయి. ఏప్రిల్‌లో విడుదలైన ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం 3.2 లక్షల రూపాయల నుంచి 5.6 లక్షల రూపాయల మధ్య ఉంది.

08/17/2016 - 16:30

ముంబయి: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.76 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 59 పాయింట్లు కోల్పోయి 28,005 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 8,624 వద్ద ముగిసింది.

08/16/2016 - 23:55

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. తమ వీడియో కాలింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్ల కోసం గూగుల్ డ్యుయో పేరుతో ఈ వీడియో కాలింగ్ యాప్‌ను పరిచయం చేసింది. ఫేస్‌టైమ్, స్కైప్ వంటి ఇతర వీడియో కాలింగ్ యాప్‌లకు ఇది పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

08/16/2016 - 23:54

ముంబయి, ఆగస్టు 16: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో పరోక్ష పన్నుల వసూళ్లు గతంతో పోల్చితే 30 శాతం పెరిగాయి. ఈసారి 1,99,970 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,52,740 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో 2016-17కుగాను నిర్దేశించుకున్న పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించగలమన్న విశ్వాసాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా వ్యక్తం చేశారు.

08/16/2016 - 23:54

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఇంజిన్ కూలింగ్ సప్లయర్ టైటాన్‌ఎక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌నకు చెందిన ఆటో కంపోనెంట్ సంస్థ.. టాటా ఆటోకంప్ సిస్టమ్స్ మంగళవారం తెలిపింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నది తెలియరాలేదు. ‘వాణిజ్య వాహన పరిశ్రమలో ఇంజిన్, పవర్‌ట్రైన్ కూలింగ్ సమస్యలకు పరిష్కారం చూపడంలో టైటాన్‌ఎక్స్ ప్రముఖ సంస్థ.

08/16/2016 - 23:54

న్యూఢిల్లీ, ఆగస్టు 16: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్.. జెఎస్‌డబ్ల్యు ప్రక్జైర్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (జెపిఒపిఎల్)లో మెజారిటీ వాటాను దక్కించుకుంటోంది. 74 శాతం వాటాను 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం జెఎస్‌డబ్ల్యు స్టీల్ తెలియజేసింది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా జరిగింది.

Pages