S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/07/2015 - 23:44

మధ్యధరా సముద్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలల్లో టర్కీ ఒకటి. దీని రాజధాని పేరు అంకారా. ఇంతకుముందు ఇస్తాంబుల్ ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. క్రీ.శ.14వ శతాబ్దానికి ముందు ఇక్కడ భారతీయ సంస్కృతి ఉండేది. ఇస్తాంబుల్ ప్రాచీన నామం వైజయంతిమాల. వారి సంస్కృతి పేరు వైజయంత సంస్కృతి. ఇస్లామిక్ దురాక్రమణల తర్వాత టర్కీ తన ప్రాచీన నాగరికతను కోల్పోయింది.

12/07/2015 - 04:11

జై క్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ (Haber) కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతినిచ్చా రు. ఈ విషవాయువుతో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పది లక్షలకు పైగా యూ దుల్ని యుద్ధం సందర్భంగా నిర్బంధించిన కేంద్రాలలో చంపివేసారు. యుద్ధాలకు మూల ప్రభువులైన అమెరికా మాజీ అధ్యక్షులు అల్‌గోరెకు పర్యావరణ పరిరక్షణలో, ప్రస్తుత అధ్యక్షుడైన బరాక్ ఒబామాకు శాంతి పరిరక్షకుడిగా నోబెల్ పురస్కారాలు లభించాయి.

12/06/2015 - 04:17

నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్ని, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏమాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, ‘‘ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్పవారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా?

12/05/2015 - 03:58

ప్రపంచంలో భారత్-నేపాల్ మాదిరి ఉమ్మడి సంస్కృతి కలిగిన దేశాలు ఉండవంటే అతిశయోక్తి లేదు. చరిత్ర, భౌగోళికత, మతం, సంస్కృతి, వివాహాలు, స్వజాతీయత వంటి అంశాల్లో ఈ రెండు దేశాల మమేకత మరే రెండు దేశాల మధ్య కనిపించదు. నేరు గూర్ఖా దళాలతో కలిసి దాదాపు యాభై సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ దేశంలో పర్వతారోహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన మాజీ సైనికులకోసం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాను.

12/04/2015 - 03:44

మానవాళి ప్రస్తుతం అవరోహణ పథంలో పయనిస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా విచ్చలవిడి శిలాజ ఇంధన వినియోగం ప్రకృతిలోని విభిన్న జీవరాశులను, జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. నేలలో సారాన్ని దెబ్బతీసింది, నీటిని కాలుష్యమయం చేయడమే కాదు, నీటి పరిమాణం కూడా దారుణంగా పడిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసింది.

12/03/2015 - 03:05

రాజ్యాంగం అనగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్ఫురించడం సహజం... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చలలో సమైక్య భావం వెల్లివిరిసింది. అయితే అద్వితీయ భారత జాతి ఏకాత్మకతకు భంగం కలిగించే భావాలు కూడ తొంగి చూసా యి. ఇలా తొంగి చూడడం బ్రిటిష్ దురాక్రమణ నాటి వికృత వారసత్వం!

12/02/2015 - 05:32

ఏ ప్రభుత్వంలోనైనా సుపరిపాలన సాగుతున్నదా, లేదా! అన్నది చెప్పడానికి రెండే గీటురాళ్లు. ఒకటి ప్రజల సమస్యలు, రెండోది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రజలకు నిత్యసమస్యలు అనేకానేకం ఉన్నా, అన్నిటికంటె ప్రధానమైనది నిత్యావసరాల ధరవరలు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రధానంగా చూడవలసింది కేటాయింపులు, అప్పులు. ఈ రెండింటిని బట్టి చూస్తే ప్రభుత్వపాలన ఏ విధంగా ఉన్నదో తేలికగానే చెప్పవచ్చు.

12/01/2015 - 05:10

భగత్‌సింగ్ సుఖదేవ్ రాజగురు వంటి పంజాబు స్వాతంత్య్రవీరులకు ప్రేరణనిచ్చింది జాతీయవాదం. గురుగోవిందసింగ్, తేజబహదూర్ వంటి వారిని సృష్టించిన భూమి పంజాబ్. వేదవ్యాసునికి జన్మనిచ్చిన ప్రాంతం. పురుషోత్తముని కాలంనుండి విదేశీ దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిన వీరభూమి ఇది. నేడేమయింది?? అమరేందర్‌సింగ్ బ్రార్ కెనడా ఎందుకు వెళ్లినట్లు?

11/30/2015 - 06:15

వామపక్షాలు పైకి ఏమిచెప్పినా లోలోపల ఇంకా డైలమాలోనే ఉన్నాయా? ‘బూర్జువా’ పార్టీలతో ఏదో ఒక పేరు తో చేతులు కలపటంవల్ల జరిగిన మేలేమో గాని రాజకీయంగా చాలా నష్టపోయామని, అందువల్ల తమలో తాము ఐక్యత సాధించటం, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయటం అనే రెండు పద్ధతులను అనుసరించి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని 2014 ఎన్నికల అనంతరం వారు నిర్ణయించుకున్నారు.

11/28/2015 - 23:00

‘యంత్రాన్ని మనిషి తయారుచేసాడు గాని, మనిషిని యంత్రం తయారుచేయలేదు... యాంత్రీకరణ అవసరమే కానీ, ప్రజల కడుపుకొట్టే యాంత్రీకరణ వద్దు...’ అనే సంభాషణలు ‘నయాదౌర్’ సినిమాలోనివి. స్వాతంత్య్రానంతరం నెహ్రూ రష్యా అడుగుజాడల్లో నడుస్తూ, పరిశ్రమల స్థాపనకై ఒప్పందాల్ని చేసుకుంటున్న సందర్భంగా 1957లో బిఆర్ చోప్రా ఈ సినిమాను నిర్మించాడు. మదర్ ఇండియా తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నయాదౌర్ రికార్డు సాధించింది.

Pages