S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/07/2016 - 01:55

శ్రీకాకుళం జిల్లా జనాభా 25.6 లక్షలు. మొన్నటి జనవరి చివరి నాటికి వలసబాట పట్టిన జనాభా 4.3 లక్షలు. రాబోయే వేసవిలో ఇది 5 లక్షలు దాటుతుందని అంచనా! జిల్లాలో చిన్నా, చితక పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు దాదాపు 6వేల పైచిలుకే. జిల్లాగుండా పోయే చెన్నై, కోల్‌కతా జాతీయ రహదారి నెం.216 పై అనేక మందుల కంపెనీలున్నాయి.

02/05/2016 - 23:35

రాజకీయాల్లో విజయం నాయకులను ఆనందంలో ముంచెత్తుతుతుంది. అయితే జిహెచ్‌ఎంసిలో తెరాస సాధించింది సాధారణ విజయం కాదు. సంతోషపెట్టడం కన్నా భయపడాల్సిన విజ యం. సాధారణ రాజకీయ నాయకులు ఒక అసాధారణ విజయంగా దీన్ని చూసి మురిసిపోకూడదు. విజయంపై మురిసిపోవడం, ప్రత్యర్థులను ఎద్దేవా చేయడం ఎవరైనా చేసేదే. కానీ నాలుగు కాలాల పాటు విజ య పరంపర కొనసాగాలన్నా, ప్రజల ఆ కాంక్షలను అర్ధం చేసుకుంటే ఈ విజయా న్ని చూసి భయపడాలి.

02/05/2016 - 05:55

టెలికాం ఆపరేటర్ల మధ్య స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చునని రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టెలికమ్యూనికేషన్ల రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం ఆపరేటర్లలో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

02/04/2016 - 06:14

సిక్కిం రాష్ట్రం సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ ప్రాంతంగా ఆవరించడం క్షతగాత్ర అయిన భూమికి చికిత్సను చేసే ప్రక్రియకు దోహదం చేయగలదు. దశాబ్దుల తరబడి భూమి అనేక రకాలుగా గాయపడింది. నిరంతర భూసార పరిరక్షణకు దోహదం చేయగల ప్రాకృతికమైన ఆరోగ్య వ్యవస్థ భంగపడడంవల్ల భూమి అంతటా రసాయన విష వ్రణాలు విస్తరించిపోయాయి. భూమికి సహజ ఆహారమైన ఆవుపేడ, ఆవు పంచితం, ఆకులు, పచ్చదనం కరువైపోవడం ప్రాకృతిక ఆరోగ్య వ్యవస్థ భంగపడడంలో భాగం.

02/03/2016 - 06:32

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల అధినేతలు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తుంటే అది యాదృచ్ఛికం కాదని, కావాలనే ఆవిధంగా వ్యవహరిస్తున్నారన్నది అవగతమవుతుంది. ఇందుకు ఉదాహరణగా బ్రిటన్‌కు చెందిన న్యాయమూర్తి ఒకరు రష్యా మాజీ గూఢచారి హత్యకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును వివరించవచ్చు.

02/02/2016 - 01:33

నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆదివారం నాడు కాపుగర్జన సభ జరిగింది. కాపు కులస్థులను బీసీ వర్గంగా గుర్తించాలనేది ఈ సభ ప్రధాన లక్ష్యం. అందుకు వారు ఆందోళనలో భాగంగా రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అసంఖ్యాకమైన వాహనాలను దగ్ధం చేశారు. విశాఖ-విజయవాడ మధ్యలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

02/01/2016 - 04:57

రాజకీయ పార్టీల మధ్య మానసిక యుద్ధాలు సాధారణమే అయినా తెలంగాణలో ఒక అసాధారణ స్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం అక్కడ రెండు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాగా రెండవది నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ రెండూ ఇదే ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి.

01/31/2016 - 07:15

జనవరి 6న మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక మంత్రివర్గ సమావేశంలో హెచ్‌ఎంటీకి సంబంధించిన మూడు యూనిట్లైన హెచ్‌ఎంటి గడియారాలను, చినార్ గడియారాలను, బేరింగ్సును మూసివేయాలని నిర్ణయించింది. వీటితోపాటుగా తుంగభద్ర స్టీలును మూసివేయాలనే నిర్ణయం తెలిసిందే! గత ఎన్‌డిఎ హయాంలో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ తిరిగి వేగవంతమైంది.

01/29/2016 - 23:32

గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్ మనదేశంలో మొ త్తం మూడు రోజులు పర్యటించారు. ఉగ్రవాదం, అది విసురుతున్న సవాలును ఎంత సమర్ధవంతంగా మనం ఎదుర్కొనగలమన్నది ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటనలోని ప్రధాన ఇతివృత్తమన్న సంగతి మనం గుర్తించాలి.

01/29/2016 - 07:38

పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఐన్‌స్టీన్ కాలాన్ని నాల్గొవ కొ లతగా నిర్ణయించినట్లు పత్రికారంగం భారత ప్రజాస్వామ్యానికి నాల్గవ కొల మానం. ‘వార్త నణచువాడు స్వాతంత్ర హర్తరా’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావుగారు. 1954లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి నార్ల వారి కృషి ఎంతగానో దోహదపడిందనేది అందరికీ గుర్తుండే వుంటుంది.

Pages