S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/17/2018 - 23:58

కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినా, కేసుల పరిష్కారానికి దశాబ్దాల కాలం పట్టినా, స్వయంగా న్యాయమూర్తులే రచ్చకెక్కినా- భారతదేశ న్యాయవ్యవస్థ అత్యున్నత ఔన్నత్యం ఇప్పటికీ మసకబారలేదు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ ఇనుమడించే ఘనకీర్తి, అమాయకులకు ఎన్నడూ శిక్ష పడకూడదనే అంశమే ఇందుకు కారణాలు.

04/15/2018 - 03:21

టి.హబ్ పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని, విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడమే గాక ప్రభుత్వం కార్పొరేటు విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు చేసినంత మాత్రాన బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాజాలదు. కోదండరామ్ వంటి నేతలు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ప్రజలు ఎన్నికల్లో ఒకే పార్టీకి పట్టం కడుతారు.

04/14/2018 - 00:16

సర్వోన్నత న్యాయస్థానం ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల మధ్య కలతలు రేపుతున్న సున్నితమైన సమస్యకు ఒక పరిష్కారం చూపాలి. దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

04/12/2018 - 21:12

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఉద్యమాలకు బలమైన నాయకత్వం అవసరం. ఆ నాయకుడు లక్ష్యసాధన దిశగా ఎవరినైనా కలుపుకునే విధంగా మసలుకోవాలి. రాజకీయ పార్టీ వాసనలు ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలతో కలసి ప్రయాణం చేసే చొరవ, ఐక్యతతో అడుగులు వేసే మనస్తత్వం నాయకుడికి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 46 నెలలు గడచింది.

04/10/2018 - 23:54

‘ ధర్మానికి నాలుగు పాదాలు’ అంటారు. అంటే- సత్యం, దయ, తపస్సు, దానం అనే గుణాలతో కూడిందని అర్థం. ధర్మాన్ని అనుసరించి న్యాయం కూడా ఈ నాలుగుపాదాలతో నడుస్తోందని సామాన్య భారతీయుడు భావిస్తున్న సమయంలో అలాంటిదేమీ లేదని సర్వోన్నత న్యాయమూర్తులే తేల్చి చెప్పారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ‘ఇలా జరుగుతోందా..?’ అంటూ ప్రపంచం నివ్వెరపోయింది.

04/08/2018 - 00:11

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీయాత్ర చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వివిధ పార్టీల నాయకులతో మంతనాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన మూడు ప్రయోజనాలు సాధించారు. అవి- 1.రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందనే అంశాన్ని జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకొనిరావడం. 2.

04/06/2018 - 23:13

‘భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నత దేవాలయం- పార్లమెంట్’ అని నాలుగేళ్ల క్రితం తొలిసారి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాంటి పార్లమెంటు పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుండడం ఆం దోళనకర పరిణామం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎటువంటి చర్చ చేపట్టకుండానే వ్యర్థంగా ముగించడం ప్రజాస్వామ్య సంస్థలు బలోపేతం కావాలని కోరుకునే వారందరికీ నిరాశ కలిగిస్తోంది.

04/04/2018 - 00:15

‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే మతాతీతమైన ఆధునిక చట్టాన్ని ఆమోదించడమేనా? ఇస్లాంలోనైనా, మరే ఇతర మతంలోనైనా మహిళల పట్ల వివక్ష చూపే అంశాలను కచ్చితంగా తొలగించాల్సిందే. ఇందుకు చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం భావించడం హర్షణీయమే. ఈ క్రమంలోనే ఉమ్మడి పౌరస్మృతి దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో ఏయే అంశాలకు వెసులుబాటు ఇవ్వాలి? ఏయే అంశాల్ని చేర్చాలనేది నిర్ణయించడం కష్టం.

04/01/2018 - 01:26

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దేశ రాజధానిలో ‘సత్యాగ్రహ’ దీక్ష చేయడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ నేతల్లో అవినీతి అంతానికి దేశవ్యాప్తంగా లో క్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన మరోసారి దీక్ష ప్రారంభించి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇచ్చిన హామీతో నిరశన వ్రతాన్ని ముగించారు. అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ఈయన లోగడ ఇలాగే హస్తినలో ‘సత్యాగ్రహం’ చేశాడు.

03/31/2018 - 00:33

ఎలాంటి రాజకీయ విలువలు ప్రదర్శించకుండా, ఎన్నికల్లో గెలుపుకోసం ఎంతటి దుశ్చర్యకైనా వెనుకాడని నేతగా పేరుతెచ్చుకొని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు కర్నాటకలో ఆయనతో ఢీకొట్టగల- ‘బలమైన రాజకీయ నేత’ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూపంలో ఎదురుపడినట్లు చెప్పవచ్చు. అందుకనే మే 12న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి.

Pages