S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/02/2016 - 02:37

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయనా ఇప్పటికీ డిఎస్‌సి పోస్టు లను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. లక్షల మంది అభ్య ర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు విడుదలైనా ప్రయోజనం లేకుండా పోయంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గురుకులాలు పెట్టినా, లక్షల మంది విద్యార్థులు చేరినా, డిఎస్‌సి నిర్వహించకపోతే విద్య చెప్పే ది ఎవరు? విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారు.

06/30/2016 - 23:45

మోదీ ప్రభుత్వం వస్తే మైనారిటీల ఊచకోత, వారిని అణగద్రొక్కటం జరుగుతుందని కాంగ్రెస్, కమ్యూనిస్టు లాంటి పార్టీలు, ములాయంసింగ్, నితీష్ లాంటి నాయకులు కూడ భావించారు. అలాంటి పరిస్థితి ఉండి ఉంటే దాన్ని చూపి లబ్దిపొందవచ్చని కుహనా సెక్యులర్ పార్టీలు భావించాయి. అలా జరగలేదు. మైనారిటీలు పైకి వ్యక్తం చేయకపోయినా మోదీ ప్రభుత్వం తమకు ఏ విధంగా హానికరం లేదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం.

06/30/2016 - 05:03

హైదరాబాద్, ఇతర పట్టణాల్లో గణేశ నిమజ్జనాలు, వూరేగింపుల వల్ల ప్రభుత్వంపై పాలనా పరంగా, ఆర్థిక, భ ద్రతా పరంగా భారం పడుతుంది. అంతేకాదు చెరువుల లో కాలుష్యం మరింత పెరిగిపోతుంది. వీధులు చెత్తగా తయారవుతాయ. చందాల వసూళ్లకోసం, బల ప్రదర్శన కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం, జరుపుతున్నట్టుగా గణేశ్ వూరేగింపులు ఉంటున్నాయ తప్ప, భక్త్భివంతో జరుగుతున్నట్టు లేదు. టివి ఛానళ్లు నిమజ్జనాల తాలూకు ప్రసారాలను మానడం మంచిది.

06/29/2016 - 00:22

రాజధాని మార్పిడికంత తొందరెందుకు? దుర్మార్గమైన రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుండవచ్చు కదా. మొగ్గలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేయాలా? ఆంధ్రా ప్రజలు పెంచి పెద్దచేసిన హైదరాబాదును కనీసం ఇంకా పది సంవత్సరాలైన వారు రాజధానిగా భావిస్తు కొద్దిగానాన్న సంతోషంగా వుండకూడదా?

06/27/2016 - 23:23

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకోసమో, రాజకీయ ప్రయోజనాలకోసమో అర్థం కావడంలేదు. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా, కాస్త కంటికి నదరుగా కనిపి స్తున్న ప్రతి పట్టణాన్ని జిల్లా చేయాలని ప్రయత్నించడమే ఇందుకు నిరద్శనం. నిజానకి పది జిల్లాల్లో కొత్త జిల్లాలు విభజన అయదారు అదనపు జిల్లాలుగా పెంచితే సరిపోతుంది. జిల్లాలు విభజన అనేది పరిపాలనా సౌల భ్యం కోసమే తప్ప మరో ప్రయోజనాన్ని ప్రతిఫలిం చకూడదు.

06/27/2016 - 03:47

మంత్రాలకు చింతకాయలు రాలేకాలం, మరణించిన వారిని బ్రతికించే యుగాలు గతించాయి. పాత యుగాలలో అవి చెల్లుబడి అయ్యాయి. మైదాస్ టచ్ అనే కథ చిన్నప్పుడే చదువుకున్నాం. నీతికి ధర్మానికి, న్యాయానికి, కట్టుబడి బతికిన రోజులవి.

06/25/2016 - 02:31

ఒక దేశానికి వంద దేశాలు సభ్యత్వం ఇవ్వాలని తమ అభిప్రాయం తెలిపితే ఒక్క దేశం వ్యతిరేకించిందని సభ్యత్వాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదు. చట్టాన్ని అప్పుడు ఏ సందర్భంలో చేశారో దాన్ని పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు చైనా ధర్మ సూత్రాలు చెబుతున్నది. 1962లో భారత్‌పై ఏ ప్రాతిపదికపై యుద్ధం ప్రకటించిందో చెప్పాలి. దేశంలోని చాలా భాగం ఆక్రమించుకుంది. ఇది ఏ పద్ధతి?

06/24/2016 - 23:38

ఒక దేశానికి వంద దేశాలు సభ్యత్వం ఇవ్వాలని తమ అభిప్రాయం తెలిపితే ఒక్క దేశం వ్యతిరేకించిందని సభ్యత్వాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదు. చట్టాన్ని అప్పుడు ఏ సందర్భంలో చేశారో దాన్ని పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు చైనా ధర్మ సూత్రాలు చెబుతున్నది. 1962లో భారత్‌పై ఏ ప్రాతిపదికపై యుద్ధం ప్రకటించిందో చెప్పాలి. దేశంలోని చాలా భాగం ఆక్రమించుకుంది. ఇది ఏ పద్ధతి?

06/23/2016 - 23:54

అనేక కష్టాలతో మునుగుతూ-తేలుతూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థకి జంటనగరాల ఆర్టీసీ బస్సుల నిర్వహణ అప్పజెప్పడం పారిపాలనా పరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా భారం కాగలదు. ‘గ్రేటర్’ నిర్వహించినంత మాత్రాన లాభసాటి అయ్యే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న ఉదయంచకమానదు.

06/23/2016 - 06:03

కొంతమంది మనుషులను చంపి తిన్నందుకు ఓ మగ సింహంపై విచారణ జరిపి, నేరం రుజువు చేసి దానికి యావజ్జీవ శిక్షగా ‘జూ’కు తరలించారట. ఈ హత్యకు తో డ్పడిన ఆడ సింహాలను, ఇతర అమాయక సింహాలను గుజరాత్‌లోని గిర్ పార్క్‌లో వదలివేశారట. మృగాలు తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో ప్రకృతే నేర్పు తుంది. ప్రాణికి ప్రాణమే ఆహారం అన్నది వేదోక్తి. సింహా లకు తెలుసా? చంపితినడం నేరమని?

Pages