S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/27/2016 - 04:01

పూర్వం విశ్వమంతా హిందూమతం విస్తరించి ఉండేది. ఏమతం వారైనా వారు పేర్కొనే దేవుళ్లు లేరు అని అనుకుంటే ఆయా మతాలు లుప్తమైపోతాయ. కానీ ఏ దేవుడూ లేడని వాదించినా హిందూమతం మాత్రం తన ఉనికిని కోల్పోదు. భగవంతుడు కాంతి స్వరూపుడు ఆయన్ను మనం చూడటం మనం చేసుకున్న పుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. భగవానుని రూపంపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక ఆధారం అవసరం.

07/26/2016 - 00:14

వృక్ష సంపద, అడవులు, సరైన కొండవాలు, గాలి లేకపోతే వర్షాలు పడవు. ఇది సామాన్యంగా బుద్ధెరిగిన ఎవరైనా చెబుతారు. ప్రభుత్వాల నిర్వాకం, పది వృక్షాలు కొట్టి, వంద మొక్కలు నాటు అన్నట్లు ఉంది. పది వృక్షాలు పోతున్నాయ కాని, ఐదు వృక్షాలు కూడ పెరగడంలేదు. నాటిన మొక్కల సంరక్షణను పట్టించుకోకపోతే, అవి పెరగడం కష్టం కదా. అందువల్ల ప్రభుత్వం మీన మేషా లు మాని సక్రమంగా అడవుల పెంపకానికి పూనుకోవాలి.

07/25/2016 - 05:16

విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేత అత్యంత దారుణమైన చర్య. ఈ విషయంలో కొంతమంది నేతలు ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆలయాలను కాపాడుకోలేనప్పుడు వాటిని నిర్మించడమెందుకు? ఒకవైపు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న సమయంలో ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. గోశాలను కూల్చడం, విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేయడం రాజ్యానికి మంచిది కాదు.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా

07/23/2016 - 00:29

దేశంలో సామాజిక అశాంతిని కలుగజేయడానికి అరాచకవాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఆ అవకాశం కోసం విచ్ఛిన్నకరవాదులు సిద్ధంగానే ఉంటారు. ఈ పెడధోరణులకు సమాజంలో స్థానం లేదని స్పష్ట పరచడంలో ప్రభుత్వం ముందుండాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపుదిద్దుకొంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన వ్యవస్థని స్వతంత్ర భారతం ఏర్పాటు చేసుకుంది.

07/21/2016 - 23:48

కార్లకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం అనుమతించింది. గ్యాస్ కిట్ల నాణ్యత సరిగా లేకపోవడంవల్ల గతంలో ప్రమాదాలు సంభవించాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్లను మాత్రమే ఆమోదించాలి. గ్యాస్‌ను కార్లకు ఇంధనంగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుంది.

07/21/2016 - 04:53

కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే గాక తగ్గడం లేదు. టమాటాలు, పచ్చిమిచ్చి, బెండకాయలు ఒకటేమిటి, చాలా రకాల కూరగాయల ధరలు శరవేగంగా పెరుగుతుండటమే తప్ప తగ్గే సూచనలు కనబడటం లేదు. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇక నిరుపేదలు పస్తులుండాల్సిందేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు తగ్గేలా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
మోదీ దూరదృష్టి

07/20/2016 - 04:44

భారత క్రికెట్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్రికెట్‌లో సమూల మార్పులను సూచిస్తూ సు ప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదించింది. లోధా కమిటీ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని, ఆరునెలల్లోగా భారత క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పేర్కొంది.

07/18/2016 - 23:46

విశాఖ నగరంలో ఆర్.కె.బీచ్ నుండి భీమిలి వరకు గల సముద్ర ప్రాంతం రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. మందు బాబులు మద్యం సేవించడం, మహిళలపై వేధింపులకు దిగడం చేస్తున్నారు. మద్యం మత్తులో తీర ప్రాంతం వెంట కార్లు, బైకులు ఓవర్ స్పీడుతో నడుపుతూ ఇతర వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఋషికొండ- భీమిలి రోడ్డుపై వ్యభిచార కార్యకలాపాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి.

07/18/2016 - 02:55

తెలంగాణ రాష్ట్రం కరువుతో బాధపడ్తుంటే కేంద్ర సాయమందలేదని ఆరోపిస్తున్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు అవసరమా అనేది పునరాలోచించి- ప్రతిపాదన విరమించుకోవడమో, వాయిదా వేయడమో మంచిది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తాలూకాల స్థానంలో మండలాలు ఏర్పాటుచేశారు.

07/16/2016 - 08:29

టీమ్ ఇండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకం హర్షణీయం. అనిల్‌కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ స్పిన్నర్. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించిపెట్టాడు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న మృదుస్వభావి. ఎలాంటి వివాదాలు లేని ఆటగాడు. టెస్టు క్రికెట్‌లో ఇండియా కెప్టెన్‌గా రాణించాడు.

Pages