S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/11/2018 - 02:14

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం హోరెత్తేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ప్రచార కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నది. నేటి విద్యా విధానాన్ని చదువు‘కొంటున్న దుస్థితి’గా పేర్కొనవచ్చు. ఇంకా... నేటి విద్యా వ్యవస్థ దోపిడీ వ్యవస్థ, మాఫియా వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు.

07/07/2018 - 00:44

వచ్చే ఏడాది ఆరంభంలో లోక్‌సభకు ఎలాగూ ఎన్నికలు తప్పవు. కాని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారా? విడివిడిగానా? అనేదానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ప్రధాని మోదీ తప్పుకోవాల్సిందే అంటూ ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐక్యతను చూపిన నాయకగణం డిమాండ్ చేస్తోంది.

07/05/2018 - 23:47

శసేవలో ప్రాణాలు కోల్పోయిన నేతల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. అటువంటి అద్భుతమైన మహా నాయకుల్లో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఒకరు. వ్యక్తిగత ప్రతిష్టకన్నా దేశహితమే ప్రధానమన్నది ఆ యన విధానం. భారత్ నుంచి జమ్ము-కాశ్మీర్ చేజారిపోకుండా ఉంచటంలో ఆయన చూపిన చొరవ జాతి గుర్తించుకోదగినది. చివరకు కాశ్మీర్ అంశంపై పోరాటంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

07/03/2018 - 23:40

ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ‘పాలకులు-విప్లవోద్యమం’పై ఓ వ్యాసం రాస్తూ- ‘సైనిక దాడులను ముమ్మరం చేస్తున్నారు.. భారత వాయుసేన, తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ కమాండ్ బలగాలు కలిసి దాడి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తూ వివిధ రూపాలలో ఆకాశదాడులు చేస్తున్నారు.

06/30/2018 - 23:32

ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి ఆరుగురు ఝార్ఖండ్ జాగ్వార్ జవాన్లను ఇటీవల పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఉభ య తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న గ్రేహౌండ్స్ మాదిరి ఝార్ఖండ్‌లో ‘జాగ్వార్స్’ దళం పనిచేస్తోంది. గడ్వా జిల్లా చింజో ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా మావోలు అదునుచూసి మందుపాతర పేల్చి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

06/29/2018 - 23:31

రోడ్డుమీదకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడన్న నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పటివరకూ అందరితో సరదాగా గడిపిన ఓ ఉద్యోగి రోడ్డు మీదకి వెళ్లిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు తరలిపోతే- మృతుని కుటుంబ సభ్యులకు దిక్కెవరు? వారి శోకాన్ని తీర్చేవారెవరు? కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు.

06/28/2018 - 00:21

గత అయిదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న ‘మానవ అక్రమ రవాణా’ సమస్యపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించడం సహేతుకంగా వుంది. వివిధ దేశాలకు సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఏటా అపహరణకు గురవుతున్న సుమారుగా పనె్నండు లక్షల మందిలో 40 శాతం చిన్న పిల్లలే కావడం విషాదకరం.

06/26/2018 - 23:21

బస్తర్ ప్రాంతంలో విమానయానం..! అవును.. జగదల్‌పూర్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు జూన్ 14న విమానం ఎగిరింది. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ విమాన ప్రయాణాలను ప్రారంభించారు. మావోయిస్టుల ప్రాబల్యం లోని బస్తర్ ప్రాంతంలో విమానాశ్రయం రావడం, సర్వీసులు ప్రారంభం కావడంతో కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు.

06/22/2018 - 23:27

అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతల మధ్య సింగపూర్‌లో తాజాగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పూర్తిస్థాయి అణునిరాయుధీకరణకు ఉ.కొరియా అంగీకరించడం, ఆ దేశ భద్రతకు తమది పూచీ అని అమెరికా ప్రకటించడంతో ఏడు దశాబ్దాల ప్రతిష్ఠంభనకు, వైరానికి తెరపడింది. ఈ ఇరు దేశాల చర్చలపై చాలా రోజులుగా నెలకొన్న ఉత్కంఠ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియలో అదృశ్యంగా ఉన్న అంశాన్ని పసిగట్టడం ముఖ్యం.

06/21/2018 - 00:02

భారతీయ ఆముష్మిక పవిత్రత, ఐహిక సౌభాగ్యానికి ‘సహ్యాద్రి పర్వత శ్రేణులు’గా సుపరిచితమైన పశ్చిమ కనుమలు అత్యంత ప్రాచీనత, ఆధునిక జీవన సమ్మిళిత ప్రకృతి సంపదగా విలసిల్లుతున్నాయి. ఉత్తర,దక్షిణ భారతావనిలోని గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలలోని అపార భూ, జల, అటవీ, పర్వత, పశుపక్ష్యాదులు వంటి అపురూప ప్రకృతి సంపన్నతకు ఈ అద్భుత కనుమలు నిలయాలుగా ఉన్నాయి.

Pages