S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/30/2018 - 23:32

ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి ఆరుగురు ఝార్ఖండ్ జాగ్వార్ జవాన్లను ఇటీవల పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఉభ య తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న గ్రేహౌండ్స్ మాదిరి ఝార్ఖండ్‌లో ‘జాగ్వార్స్’ దళం పనిచేస్తోంది. గడ్వా జిల్లా చింజో ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా మావోలు అదునుచూసి మందుపాతర పేల్చి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

06/29/2018 - 23:31

రోడ్డుమీదకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడన్న నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పటివరకూ అందరితో సరదాగా గడిపిన ఓ ఉద్యోగి రోడ్డు మీదకి వెళ్లిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు తరలిపోతే- మృతుని కుటుంబ సభ్యులకు దిక్కెవరు? వారి శోకాన్ని తీర్చేవారెవరు? కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు.

06/28/2018 - 00:21

గత అయిదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న ‘మానవ అక్రమ రవాణా’ సమస్యపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించడం సహేతుకంగా వుంది. వివిధ దేశాలకు సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఏటా అపహరణకు గురవుతున్న సుమారుగా పనె్నండు లక్షల మందిలో 40 శాతం చిన్న పిల్లలే కావడం విషాదకరం.

06/26/2018 - 23:21

బస్తర్ ప్రాంతంలో విమానయానం..! అవును.. జగదల్‌పూర్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు జూన్ 14న విమానం ఎగిరింది. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ విమాన ప్రయాణాలను ప్రారంభించారు. మావోయిస్టుల ప్రాబల్యం లోని బస్తర్ ప్రాంతంలో విమానాశ్రయం రావడం, సర్వీసులు ప్రారంభం కావడంతో కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు.

06/22/2018 - 23:27

అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతల మధ్య సింగపూర్‌లో తాజాగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పూర్తిస్థాయి అణునిరాయుధీకరణకు ఉ.కొరియా అంగీకరించడం, ఆ దేశ భద్రతకు తమది పూచీ అని అమెరికా ప్రకటించడంతో ఏడు దశాబ్దాల ప్రతిష్ఠంభనకు, వైరానికి తెరపడింది. ఈ ఇరు దేశాల చర్చలపై చాలా రోజులుగా నెలకొన్న ఉత్కంఠ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియలో అదృశ్యంగా ఉన్న అంశాన్ని పసిగట్టడం ముఖ్యం.

06/21/2018 - 00:02

భారతీయ ఆముష్మిక పవిత్రత, ఐహిక సౌభాగ్యానికి ‘సహ్యాద్రి పర్వత శ్రేణులు’గా సుపరిచితమైన పశ్చిమ కనుమలు అత్యంత ప్రాచీనత, ఆధునిక జీవన సమ్మిళిత ప్రకృతి సంపదగా విలసిల్లుతున్నాయి. ఉత్తర,దక్షిణ భారతావనిలోని గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలలోని అపార భూ, జల, అటవీ, పర్వత, పశుపక్ష్యాదులు వంటి అపురూప ప్రకృతి సంపన్నతకు ఈ అద్భుత కనుమలు నిలయాలుగా ఉన్నాయి.

06/20/2018 - 00:05

దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో మకాం వేసిన మావోయిస్టులను అరికట్టడంలో సిఆర్‌పిఎఫ్‌కు ఎదురవుతున్న భాషా పరమైన, భౌగోళిక పరమైన సమస్యలను అధిగమించానికి ‘బస్తరియా బెటాలియన్’ ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఏడాదిపాటు శిక్షణ ము గిశాక, ఇటీవల జరిగిన ఈ బెటాలియన్ ‘పాసింగ్ ఔట్ పరేడ్’కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హాజరయ్యారు.

06/19/2018 - 00:04

రాష్ట్రాల విభజన అంచెలంచెలుగా జరిగి, 2014 జూన్ 2 నాటికి 29 రాష్ట్రాలుగా, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత్ రూపుదిద్దుకుంది. ఢిల్లీకి శాసనసభ ఏర్పాటైనా, దేశ రాజధాని గనుక అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాగా, గత కొన్ని నెలలుగా టీవీ చానళ్లు, దినపత్రికల విశే్లషణలను చూస్తుంటే- ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్టమ్రా? కేంద్ర పాలిత ప్రాంతమా? అనే అనుమానం కలుగుతోంది.

06/17/2018 - 01:46

‘ఆ రెస్సెస్,్భజపాలు సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దుచేస్తున్నాయి’ అంటూ కొన్ని ఎస్సీ,ఎస్టీ సంఘాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బిఎస్పీ వంటి పార్టీలు, కొన్ని ముస్లిం సంస్థలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్‌ల్లో పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఈ ప్రభావానికి గురైన గ్రామీణ ఎస్సీ, ఎస్టీ యువకులు ఏప్రిల్ 2న భారత్ బంద్‌ను నిర్వహించారు.

06/15/2018 - 23:42

మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ చాలా అసహనం ప్రదర్శించింది. మీడియాలో దీనికి విశేష ప్రాధాన్యం లభించడంతో ఏనా డూ ప్రచారానికి ఉబలాట పడని ఆరెస్సెస్‌కు కలిసొచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ సేవాదళ్‌ను పటిష్టం చేస్తానని చెబుతోంది.

Pages