S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/14/2018 - 00:51

ఛత్తీస్‌గఢ్‌లో కొద్దిరోజుల క్రితం 62 మంది మావోయిస్టులు ఆయుధాలతో పాటు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం పెద్ద విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. నారాయణపూర్ జిల్లాలో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల ముందు సాయుధ మావోలు ఆత్మసమర్పణ చేశారు. విచిత్రమేమిటంటే... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు నియమితులయ్యారన్న వార్త వెలువడిన రోజునే ఈ లొంగుబాటు జరగడం గమనార్హం.

11/11/2018 - 01:32

దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకురావాలని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు శుభ సంకేతాలు కర్నాటక ఉపఎన్నికల ఫలితాల రూపంలో వెలువడ్డాయి. కర్నాటకలో మూడు లోక్‌సభ, రెండు శాసనసభ నియోజకవర్గాలలో జనతాదళ్ (ఎస్)- కాంగ్రెస్ కూటమి విజయ దుందుభి మోగించింది.

11/10/2018 - 00:54

రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ‘ఈ-ప్రగతి’లో దూసుకుపోతోంది. సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచేందుకు ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని శాఖలను ‘ఈ-ప్రగతి’ వేదికతో అనుసంధానించే ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

11/07/2018 - 01:48

తెలంగాణలో ఎన్నికల హోరు పెరిగింది. అధికార పక్షం, విపక్ష కూటమి ప్రధానంగా పోటీపడుతున్నాయి. విపక్ష కూటమిలో సిపిఐ ఉండటం గమనార్హం. ఇక సిపిఎం- ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్)’ పేరుతో బరిలోకి దిగుతోంది. న్యూడెమొక్రసీ లాంటి నక్సల్ పార్టీ గుమ్మడి నర్సయ్యను నమ్ముకుంది. ఒకప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా కనిపించేది. క్రమంగా వారి ప్రాభవం నేలమట్టమైంది.

11/04/2018 - 02:30

ప్రపంచం ఇప్పుడు యంత్రయుగం వైపు పరుగులు పెడుతోంది. అన్ని రంగాలలో జరుగుతున్న ఆవిష్కరణలు,పరిశోధనలు యంత్రయుగం వైపే కొనసాగుతున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విస్తృతి కారణంగా సమాజంలో నాలుగో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. డిజిటల్ విప్లవం ఈ దశలో కీలకపాత్ర పోషిస్తోంది. మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ-కామర్స్‌తో ‘దృశ్యం’ పూర్తిగా మారిపోతోంది.

11/03/2018 - 00:32

భారతీయ జనతాపార్టీ చేసిన మిత్రద్రోహానికి రగిలిపోతున్న తెలు గుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఇరవై ఏళ్ల క్రితం జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్రలోకి మళ్ళీ ఇపుడు ప్రవేశించారు. జాతీయ పార్టీ అండ లేకుండా రాజకీయ కూటములు మనలేవని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుకి తెలియనిది కాదు.

11/02/2018 - 00:29

శరీరంలోని ప్రతి అంగానికి జ్ఞానాన్ని స్వీకరించగల శక్తి ఉన్నది. సాధన మాత్రం మెదడులోనే జరుగుతుంది. పిల్లలు సైకిల్ తొక్కుతారు. కాళ్లనుంచి ఆ జ్ఞానం మెదడుకు ప్రసరిస్తుంది. అక్కడ లెర్నింగ్ (సాధన) జరుగుతుంది. పిల్లలు ఈత కొడతారు. శరీర భాగాలు దాన్ని సంఘర్షిస్తాయి. మెదడులో ఉండే ప్రక్రియతో దానిపై సాధన జరుగుతుంది. పిల్లలకు సంబంధించి శరీరంలోని అన్ని అంగాలను ఈ ప్రక్రియలో భాగస్వామి చేయాలి.

11/01/2018 - 00:45

బ్రిటిష్ పాలనలోనూ మన దేశంలో అనేక సామ్రాజ్యాలు రాజుల అధీనంలో ఉండేవి. 55 శాతం రాజ్యాలు బ్రిటన్ రాణి ప్రతినిధులతోనూ, 45 శాతం రాజ్యాలు కప్పం చెల్లిస్తున్న రాజుల పాలనలో కొనసాగేవి. రాజుల కాలంలోనూ చట్టసభలు, న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం, రక్షణ దళం వంటివి ఉండేవి. రాజుల వ్యవస్థ కూలిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన కొనసాగుతున్నది.

10/31/2018 - 01:11

సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు వినగానే- దేశ స్వాతంత్య్రం అనంతరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన పటేల్ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది.

10/28/2018 - 03:20

‘నెహ్రూ, గాంధీ వంశీయులపై భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్రను లిఖించాలని చూస్తోంది.. స్వాతంత్య్ర పోరాటంలో ఇసుమంతైనా పాత్రలేని వారు ఇప్పుడు సమరయోధుల వారసత్వం, త్యాగాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారి చెప్పుచేతల్లో ఉండేది..’- అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు అసత్య ప్రచారానికి పరాకాష్ఠ.

Pages