S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/13/2019 - 01:35

స్వాతంత్య్రానంతర కాలం నాటికి, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే క్రమంగా రాజకీయాలు ఎలా పతన స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతుంది. మన దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ తనపై విమర్శలను, వ్యంగ్యోక్తులను సహృదయంతో ఆహ్వానించేవాడు. ప్రతిపక్షాలకు సముచిత గౌరవం ఇచ్చేవాడు. వాజపేయి లాంటి ప్రతిపక్ష నాయకున్ని గౌరవభావంతో చూసేవాడు. ఎలాంటి విమర్శనైనా స్వీకరించేవాడు.

01/11/2019 - 21:39

బీదరికంలో పుట్టి అకుంఠిత దీక్షతో భీమవరం నుండి బోస్టన్ చేరి జీవితాన్ని వైద్య పరిశోధనలకు అంకితం చేసిన తెలుగుబిడ్డ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎన్నో వ్యాధులకు దివ్యమైన ఔషధాలను కనిపెట్టిన అపర ధన్వంతరి ఆయన. 1895 జనవరి 12న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన జన్మించారు. తండ్రి జగన్నాథం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తూ ముందుగానే పదవీ విరమణ చేయడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది.

01/11/2019 - 01:25

తరగతి గదిలో ఒక అసెస్‌మెంట్ తర్వాత ఇలా చేశాం. తరగతి గదిని 5 బ్యాచ్‌లుగా వర్గీకరించాం. ప్రతి బ్యాచ్‌లో తెలివిగల పిల్లలు ఇద్దరిని, మధ్యతరగతిగా ఉన్న ఇద్దరిని, పరీక్షలు బాగా రాయలేని పిల్లలు ఇద్దరిని ఒక బ్యాచ్‌గా పెట్టారు. ఇలా 5 బ్యాచ్‌లు చేశాం. ఆ అసెస్‌మెంట్‌లో ప్రతి గ్రూపులో పరీక్ష పేపర్లు దిద్దాక ఆ టీమ్‌లో ఆరుగురు అందరి పేపర్లను అందరూ పరిశీలించాలి.

01/10/2019 - 01:34

తెలంగాణ ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభానికి అనేక చారిత్రక కారణాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు 30కి పైగా హామీలిచ్చి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది.

01/09/2019 - 02:40

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ‘చుక్కల భూముల’ సమస్య ఇకపై పరిష్కారం కానుంది. దాదాపు 64 సంవత్సరాల నుంచి రైతులు, వారి కుటుంబాలు తమ భూములకు సంబంధించి ఈ ‘చుక్కల’ చిక్కులతో అల్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ‘చుక్కల’ వెనక పెద్ద కథే ఉంది. బ్రిటీష్ పాలకుల హయాంలో 1906లో దేశవ్యాప్తంగా భూములపై సర్వే జరిగింది. ఆ తర్వాత 1954లో రీ సర్వే చేశారు.

01/08/2019 - 01:09

కష్టపడిన వ్యక్తికి ఆ పనికి తగ్గ కూలి ఇవ్వటం సర్వసాధారణం. సమా జంలో అది కనీస ధర్మం కూడా. కూలి ఇవ్వని పక్షంలో పని చేయించుకున్న వ్యక్తి లేదా యజమాని క్షమార్హుడు కాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళ పరిపాలనలో తన కష్టానికి రాబోయే 2019 ఎన్నికల్లో తగిన కూలి ఇవ్వాలని జన్మభూమి గ్రామసభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

01/06/2019 - 05:45

‘నీలోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే నిజమైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని
మించిన పుస్తకం ఏముంటుంది?’
- మహాత్మా గాంధీ

01/04/2019 - 21:51

రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత మన దేశానికి ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ కాకుంటే- ఆ పీఠాన్ని ఎక్కేదెవరని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో ఇప్పటికీ రెండే రెండు ప్రధాన పార్టీలు.

01/04/2019 - 01:56

తొర్రూర్ ‘వందేమాతరం స్కూల్’లోని పిల్లలను పరిశీలిస్తూ, వారి చదువుల పద్ధతిని చూస్తూ నేను వారితో తిరిగేవాణ్ణి. ఇచ్చిన లెక్కల సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారో చూసేవాణ్ణి. లెక్కల స్టెప్స్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే- వారి నుంచి జవాబు వచ్చేది కాదు.

01/03/2019 - 21:59

ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులు చేసే చిన్న తప్పులకు సైతం పెద్దశిక్షలు వేయడం తరచుగా మనం గమనిస్తున్నాం. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, హోం వర్క్ చేయలేదని, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఫీజులు సకాలంలో చెల్లించలేదని, టై బెల్టు, షూ, యూనిఫాం లాంటివి ధరించలేదనే చిన్న చిన్న విషయాలకు కూడా ఉపాధ్యాయులు అనవసరంగా ఆవేశపడి విద్యార్థులను అమానవీయంగా శిక్షిస్తున్నారు.

Pages