S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/28/2017 - 02:00

హైదరాబాద్, జూన్ 27: ఇండోనేసియా సూపర్ సిరీస్, తాజాగా ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిళ్లను దక్కించుకోవడంతో తిరిగి ప్రపంచ టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్న కిడాంబి శ్రీకాంత్ ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోవడంపై దృష్టిపెట్టాడు. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం కోసమే తాను ఆ టోర్నమెంట్‌లో ఆడుతానని చెప్పాడు.‘ తిరిగి టాప్ టెన్‌లోకి రావడం గొప్ప విషయమే.

06/28/2017 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల్లో రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వ్యతిరేకిస్తున్న కొన్ని కఠినమైన సిఫారసులను అధ్యయనం చేసేందుకు బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

06/28/2017 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ సిద్ధమవుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తులు సమర్పించే గడువును జూలై 9వ తేదీ వరకు పొడిగించాలని బిసిసిఐ నిర్ణయించడంతో రేసులో దిగేందుకు రవిశాస్ర్తీ చాలా ఆసక్తితో ఉన్నట్లు అతని సన్నిహితుడు ఒకరు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.

06/28/2017 - 01:56

హైదరాబాద్, జూన్ 27: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్ గ్రామానికి చెందిన సింధూజ రెడ్డి అమెరికా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గతంలో ఆమె హైదరాబాద్ మహిళా జట్టు తరఫున రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడింది. అలాగే అండర్-19 క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్-19 భారత జట్టు సభ్యురాలిగా పలు పోటీల్లో పాల్గొంది.

06/28/2017 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 27: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ మరో ఐదేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లకు టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగనుంది. ఈ సంస్థ భారీ మొత్తంలో 2,199 కోట్ల రూపాయలకు బిడ్ దాఖలు చేసి మంగళవారం టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను నిలబెట్టుకుంది. ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం గతంలో ఈ సంస్థ కుదుర్చుకున్న కాంట్రాక్టు మొత్తం కంటే ఇది 554 శాతం ఎక్కువ.

06/28/2017 - 01:53

ముంబయి, జూన్ 27: ఒలింపిక్ కాంస్యపతక విజేత, ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్ ఆగస్టు5న చైనాకు చెందిన జుల్పికర్ మైమైతాలితో తలపడతాడు.

06/28/2017 - 01:52

న్యూయార్క్, జూన్ 27: మహిళా టెన్నిస్‌లో 23 గ్రాండ్‌శ్లామ్ సింగిల్స్ టైటిళ్లతో తనకు ఎదురు లేదని చాటి చెప్పిన సెరేనా విలియమ్స్ తనకు పురుషుల టెన్నిస్ సర్క్యూట్‌లో 700వ ర్యాంక్ ఇచ్చిన మెకన్రోపై తనదైన రీతిలో ఎదురుదాడి చేసింది.

06/28/2017 - 01:51

న్యూఢిల్లీ, జూన్ 27: నేపాల్ రాజధాని ఖాడ్మండూలో జరిగిన వరల్డ్ గేమ్స్‌లో భారత త్రోబాల్ జట్లు చరిత్ర సృష్టించాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఈ గేమ్స్‌లో భారత పురుష, మహిళా జట్లు పసిడి పతకాలను కైవసం చేసుకున్నాయి.

06/27/2017 - 00:43

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 26: వెస్టిండీస్‌తో ఈనెల 30న అంటిగువాలో జరిగే మూడో వనే్డ ఇంటర్నేషనల్‌లో యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరోక్షంగా వెల్లడించాడు. విండీస్‌తో జరిగిన రెండో వనే్డను 105 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న భారత్ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

06/27/2017 - 00:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పర్యాయాలు 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు వనే్డలో ఐదు వికెట్లకు 310 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.

Pages