S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/22/2018 - 01:05

బెర్న్, సెప్టెంబర్ 21: యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యూఫా) ఆధ్వర్యంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 3-0 తేడాతో యంగ్ బాయిస్‌ను ఓడించింది. పాల్ పోగ్బా రెండు గోల్స్ చేసి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆట 35వ నిమిషంలో తొలి గోల్ చేసిన పోగ్బా 44వ నిమిషంలో తనకు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్నాడు.

09/21/2018 - 02:24

న్యూఢిల్లీ: క్రీడరంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్త్న్ర అవార్డును భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు కేంద్రం ప్రకటించింది. 2018 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్‌ఖేల్ రత్న, 20 మందికి అర్జున, నలుగురికి ధ్యాన్‌చంద్, ఎనిమిది మందికి ద్రోణాచార్య పురస్కారాలను ప్రకటించింది.

09/20/2018 - 23:35

దుబాయ్, సెప్టెంబర్ 20: ఆసియా కప్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసినప్పటికీ, శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్ అనుకున్నంత సులభం కాదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గెలిచిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

09/20/2018 - 23:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం గుర2వారం ప్రకటించిన అవార్డుల జాబితాలో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కోర్టుకెళతానని హెచ్చరించాడు.

09/20/2018 - 23:32

దుబాయ్, సెప్టెంబర్ 20: పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ గొప్పగా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో తనవంతు భూమిక పోషించాడు. ఇంతకీ అతని విజయ రహస్యం ఏమిటంటే, నెట్స్‌లో బౌలింగ్ చేయకపోవడమేనట. అతనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

09/20/2018 - 23:30

చెన్నై, సెప్టెంబర్ 20: జార్ఖండర్ స్పిన్నర్ షాబాజ్ నదీం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లిస్ట్ ‘ఏ’లో సుమారు రెండు దశాబ్దాల క్రితం నమోదైన రికార్డును తిరగరాశాడు. విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీం కేవలం 10 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు కూల్చాడు.

09/20/2018 - 23:29

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా ఆర్. సురేందర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. క్లబ్ డైరెక్టర్ల సమావేశంలో డైరెక్టర్లు/ స్టివార్డ్స్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. కే. భూపాల్ రెడ్డి, సీఎస్ సురేష్, అనంత్ కిషన్ రావు, ఆర్. రాజేష్ డైరెక్టర్స్/ స్టివార్డ్స్‌గా ఎన్నికైనట్టు క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

09/20/2018 - 23:28

సిడ్నీ, సెప్టెంబర్ 20: పాకిస్తాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడతామని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు.

09/20/2018 - 04:35

దుబాయలో జరుగుతున్న ఆసియాకప్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్‌ను ఔట్ చేసిన భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

09/19/2018 - 23:51

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పారా బాడ్మింటన్ క్రీడాకారుడు రాజ్‌కుమార్ (మధ్య)కు అర్జున అవార్డును ప్రదానం చేస్తున్న కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (కుడి). చిత్రంలో క్రీడా కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కూడా ఉన్నారు

Pages