S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/10/2019 - 22:56

పూణె, అక్టోబర్ 10: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు అదర గొడుతున్నారు. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 25 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (14) వికెట్‌ను కోల్పోయనా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు.

10/10/2019 - 22:50

ర ష్యాలోని ఉలన్‌ఉదేలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్ వాల్సెనియా విక్టోరియాపై గెలిచిన మేరీకోమ్ ( భారత్). ఈ విజయంతో మేరీకోమ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతేకాకుండా మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎనిమిది పతకాలు సాధించిన క్రీడాకారిణిగా మేరీకోమ్ సరికొత్త రికార్డును సృష్టించింది.

10/10/2019 - 22:48

కరాచీ, అక్టోబర్ 10: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శనతో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. అయతే మ్యాచ్ అనంతరం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి కోచ్ మిస్బావుల్ హక్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీ20ల్లో నెంబర్ వన్ జట్టు అనుభవలేమీ జట్టుతో జరిగిన సిరీస్‌లో పాక్ వైట్‌వాష్ కావడానికి కారణాలెంటని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నక మిస్బా వ్యంగ్యంగా సమాధానమి చ్చాడు. అవును..

10/10/2019 - 22:47

ఆలూరు, అక్టోబర్ 10: ప్రతిష్టాత్మక విజయ్ హజారే దేశవాళీ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుపై హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరా బాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 171 పరుగు లు చేసింది. తిలక్ వర్మ (83), భవనక సందీప్ (28) రాణిం చారు.

10/09/2019 - 23:47

పూణె : భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి పూణె వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండు సెంచరీలకు తోడు మాయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండో టెస్టులోనూ విజయం సాధించి , మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవ సం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.

10/09/2019 - 23:42

వడోదర, అక్టోబర్ 9: దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న జరుగుతున్న మూడు వనే్డల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. వడోదర వేదికగా బుధవారం జరిగిన తొలి వనే్డలో మిథాలీ రాజ్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జులన్ గోస్వామి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ లిజెల్లీ లీ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది.

10/09/2019 - 23:41

*చిత్రం... యూరో 2020 క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లతో పాటు ట్రెయింనింగ్ సెషన్‌లో పాల్గొన్న నెదర్లాండ్స్
జాతీయ ఫుట్‌బాల్ టీమ్ కోచ్ రోనాల్డ్ కోమాన్.

10/09/2019 - 23:38

బ్రిస్బేన్స్, అక్టోబర్ 9: శ్రీలంకతో బ్రిస్బేన్స్ వేదికగా బుధవారం జరిగిన చివరి వనే్డలో ఆస్ట్రేలియా మహిళా జట్టు విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో అటు టీ20, ఇటు వనే్డల్లో లంక వైట్‌వాష్‌కు గురైంది. అం తకుముందు టాస్ గెలిచిన శ్రీలంక ముందు గా బ్యాటింగ్‌కు దిగింది.

10/08/2019 - 00:14

దుబాయ్ : ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు కనబరచిన భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి ఎగబాకాడు. ఇది అతినికి కెరీర్‌బెస్ట్ ర్యాంకు.

10/08/2019 - 00:12

*చిత్రం...హైదరాబాద్‌లో సోమవారం నాడు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న భారత బాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు

Pages