S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/03/2017 - 01:10

అడెలైడ్, డిసెంబర్ 2: ఇంగ్లాండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్ చరిత్రలో మొట్టమొదటిసారి డే/నైట్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది.

12/03/2017 - 01:09

భువనేశ్వర్, డిసెంబర్ 2: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకున్న భారత్ రెండో మ్యాచ్‌లో మరో బలమైన జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొని, 2-3 తేడాతో ఓటమిపాలైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ వ్యూహానికి భారత్ చిత్తయంది. 25వ నిమిషంలో ఆ జట్టు వ్యూహం ఫలించింది. డేవిడ్ గుడ్‌ఫీల్డ్ ఇంగ్లాండ్ తరఫున గోల్స్ ఖాతా తెరిచాడు.

12/02/2017 - 00:49

క్రెమ్లిన్, డిసెంబర్ 1: సాకర్ వరల్డ్ కప్‌ను విజయవంతమవుతుందని, ఇందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఈ మెగా ఈవెంట్‌కు వివిధ దేశాల అధికారులు, అభిమానులను ఆహ్వానిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అన్నాడు.

12/02/2017 - 00:45

అడెలైడ్, డిసెంబర్ 1: ప్రత్యర్థుల్ని కించ పరచడం, విద్వేషపూరితమైన మాటలతో వెక్కిరించడం ఆస్ట్రేలియాకు అలవాటేనని, అందులో ఆశ్చపడాల్సిది ఏమీ లేదని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ వ్యాఖ్యానించాడు.

12/02/2017 - 00:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జాతీయ బాక్సింగ్‌కు పరిశీలకురాలిగా తన పదవికి మేరీ కోమ్ రాజీనామా చేసింది. నిబంధనల ప్రకారం క్రీడల్లో కెరీర్‌ను కొనసాగిస్తున్న వారు ఈ పదవిలో కొనసాగడానికి అనర్హులు. అందుకే, తాను వారం రోజుల క్రితమే రాజీనామా చేశానని ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న కోమ్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ టోర్నీల్లో తాను పాల్గొంటానని చెప్పింది.
చిత్రం..మేరీ కోమ్

12/02/2017 - 00:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తాను ఎవరి కోసమో విధానాలు మార్చుకోనని, తాను తానుగా ఉంటానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇమిస్ వరల్డ్ మానుషి చిల్లార్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.

12/02/2017 - 00:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి మొదలుకానుండగా, టీమిండియా కెప్టెన్‌ను ఎంపిక సమస్య వేధిస్తున్నది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. ధావన్ 94 పరుగులు సాధిస్తే, రాహుల్ 79 పరుగులు చేశాడు.

12/02/2017 - 00:39

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లా మైదానం ఆసక్తిని రేపుతున్నది. మిగతా స్టేడియాల్లో మాదిరిగానే, గతంలో కోట్లా పిచ్‌ని కూడా స్పిన్‌కు అనుకూలంగా తీర్చిదిద్దేవారు. కానీ, రాబోయే దక్షిణాఫ్రికా టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, పిచ్‌ని సీమర్లకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిరంగంగానే కోరవడంతో, ఆ తరహా పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు.

12/02/2017 - 00:38

భువనేశ్వర్, డిసెంబర్ 1: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ మొదటి రోజునే డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. మ్యాచ్ ఆరంభం లోనే భారత క్రీడాకారులు దాడులకు ఉపక్రమించినప్పటికీ, గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను ఆసీస్ గోల్‌కీపర్ టేలర్ లోవెల్ వమ్ము చేశాడు.

12/01/2017 - 01:32

మాస్కో, నవంబర్ 30: వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా సాకర్ వరల్డ్ కప్ మెయిన్ డ్రాను క్రెమ్లిన్‌లో శుక్రవారం తీస్తారు. 2014 వరల్డ్ కప్ ఫైనల్‌లో లియోనెల్ మెస్సీ నాయకత్వం వహించిన అర్జెంటీనాను ఓడించిన జర్మనీ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 1962లో బ్రెజిల్ తర్వాత వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కేందుకు జర్మనీ తహతహలాడుతున్నది.

Pages