S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/13/2018 - 03:54

కోల్‌కతాలోని ఒక మిఠాయ దుకాణంలో స్వీట్లతో
ఫిఫా వరల్డ్ కప్‌ను పోలిన కప్‌ను తయారు చేస్తున్న దృశ్యం

06/13/2018 - 03:52

రియోడిజనెరియో, జూన్ 12: ఫుట్‌బాల్ అంటే ఎంతో అభిమానించే బ్రెజిల్‌వాసుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందట. రష్యాలో ఈనెల 14 నుంచి వచ్చేనెల 15వ తేదీవరకు జరిగే క్రీడాసంబరంపై బ్రెజిల్‌లోని సగానికి పైగా జనాలకు ఇష్టం లేదని జరిగిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌కు ప్రపంచంలోనే ఘనమైన చరిత్ర ఉంది.

06/13/2018 - 03:52

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలోని అన్ని ప్రాంతీయ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రాల పనితీరుపై సమీక్షలతో పాటు క్రీడాకారులకు ఇస్తున్న ఆహార, వసతి వంటి ఇతర విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

06/13/2018 - 03:51

దాక, జూన్ 12: ఆసియాకప్ మహిళల టీ-20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. ఆరుసార్లు వరుస విజేతగా నిలిచిన భారత జట్టుతో కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు గెలుపెవరిదో అన్నట్టు కొనసాగింది.

06/13/2018 - 03:51

మాస్కో, జూన్ 12: ఫిఫా వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ మరోసారి సాకర్‌లో సత్తా చాటేందుకు, తద్వారా మళ్లీ మరోసారి చాంపియన్‌గా అవతరించేందుకు మంగళవారం రష్యా చేరుకుంది. కెప్టెన్ మాన్యుయెల్ న్యూయెర్‌తో కలసి వచ్చిన టీమ్‌కు ఇక్కడి రష్యావాసులు ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లంతా 26 సెట్ల జెర్సీలతోపాటు 12 టన్నుల వస్తు సామాగ్రితో చేరుకున్నారు.

06/12/2018 - 02:53

బ్రోనిట్సీ (రష్యా): ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకుంటానని అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ స్పష్టం చేశాడు. సోమవారం అతను ఒక స్పానిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఏ విధంగా ఆడుతుందనే అంశంపైనే తన నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నాడు.

06/12/2018 - 01:54

మాంటెవీడియో (ఉరుగ్వే), జూన్ 11: బ్రెజిల్‌లో జరిగిన 2014 సాకర్ వరల్డ్ కప్‌తో పోలిస్తే తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకున్నానని ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ సొరెజ్ స్పష్టం చేశాడు. ఈసారి వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు రష్యాకు బయలుదేరే ముందు ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ బ్రెజిల్ సాకర్ వరల్డ్ కప్‌లో చోటు చేసుకున్న సంఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించాడు.

06/12/2018 - 01:53

మాస్కో, జూన్ 11: మొత్తం 32 జట్లకు చెందిన హేమాహేమీ ఆటగాళ్లంతా వరల్డ్ కప్ సాకర్‌లో తమను తాము నిరూపించుకునేందుకు బరిలోకి దిగనున్నారు. వీరిలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందరూ సమర్థులే. ప్రతిభాపాటవాలున్న వారే. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎక్కువ గోల్స్ చేసి లేదా అద్వితీయ ప్రజ్ఞను చూపిన వారే స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.

06/12/2018 - 01:51

సోచీ, జూన్ 11: అత్యధికంగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రెజిల్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. టైటిల్ వేటుకు సిద్ధంగా ఉన్న ఈ జట్టు ఆటగాళ్లు వియన్నా నుంచి బయలుదేరి, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝామున మూడు గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకున్నారు.

06/12/2018 - 01:48

న్యూఢిల్లీ, జూన్ 11: ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న ఇద్దరు భారత క్రికెట్ బ్యాట్స్‌మెన్‌లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగే టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

Pages