S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/08/2017 - 02:40

సియోల్, డిసెంబర్ 7: ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందన్న వాస్తవం వెలుగు చూడడంతో, వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన రష్యాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెలుసుబాటు కల్పించింది. తటస్థ పతాకం కింద పోటీ చేయవచ్చని రష్యా అథ్లెట్లకు ఒక ప్రకటనలో సూచించింది. గతంలోనూ ఈ విధంగా ఐఓసీ పతాకం కింద పోటీకి దిగినవారు ఉన్నారని తెలిపింది.

12/08/2017 - 02:38

పారిస్, డిసెంబర్ 7: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రియల్ మాడ్రిక్ ఆటగాడు, పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. బొరషియా డార్ట్‌మండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతను గోల్ సాధించి, రియల్ మాడ్రిడ్ 3-2 తేడాతో గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు.

12/08/2017 - 02:37

వెల్లింగ్టన్, డిసెంబర్ 7: నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయని కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. శనివారం హామిల్టన్‌లో మొదలయ్యే రెండో టెస్టులో ఆడే అవకాశాన్ని అతను కోల్పోయాడు. వెల్టింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో వెస్టిండీస్ నిర్ణీత కోటా కంటే మూడు ఓవర్లు తక్కువ బౌల్ చేసింది.

12/08/2017 - 02:35

మెల్బోర్న్, డిసెంబర్ 7: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. ఈ ఏడాది జనవరిలో, గర్భవతిగానే సెరెనా ఈ టోర్నమెంట్ ఆడింది. సెప్టెంబర్‌లో అమ్మాయికి జన్మనిచ్చిన 36 ఏళ్ల సెరెనా మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో ఉందని స్థానిక వార్తా పత్రిక కథనం.

12/08/2017 - 02:35

దుబాయ్, డిసెంబర్ 7: శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. లంకతో జరిగిన మూడు టెస్టుల్లో అతను పలు రికార్డులను బద్దలు చేస్తూ, 610 పరుగులు సాధించాడు. ఫలితంగా మూడు స్థానాలను మెరుగుపరచుకొని, టెస్టు బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

12/08/2017 - 02:34

చెన్నై, డిసెంబర్ 7: చెన్నై సూపర్ కింగ్స్ 2015 రోస్టర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకోవచ్చని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ చెన్నై జట్టుకు వస్తాడనీ, అతనికే పగ్గాలు దక్కుతాయనీ అభిమానులు ఆశిస్తున్నారు.

12/08/2017 - 02:32

కరాచీ, డిసెంబర్ 7: తనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు కక్ష కట్టారని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదు సంవత్సరాల సుస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న ఓపెనర్ షర్జీల్ ఖాన్ ఆరోపించాడు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, బుకీలతో తనకు సంబంధాలు లేవని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

12/08/2017 - 02:44

సింగపూర్, డిసెంబర్ 7: ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ (ఎఫ్‌టీపీ) షెడ్యూల్‌పై వస్తున్న విమర్శలు, అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) భవిష్యత్ నిర్ణయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సభ్యులకు గురువారం ఇక్కడ ప్రారంభమై రెండు రోజుల వర్క్‌షాప్‌లో బీసీసుఐ పాల్గొంటున్నది.

12/06/2017 - 23:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: యువ ఆటగాడు ధనంజయ సిల్వ సెంచరీతో ఆదుకోవడంతో, భారత్‌తో ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన చివరి, మూడో టెస్టును శ్రీలంక డ్రా చేసుకోగలిగింది. భారత బౌలింగ్ విభాగంలో లోపాలను తెరపైకి తెచ్చే విధంగా ధనంజయ, నిరోషన్ డిక్‌విల్లా, రోషన్ సిల్వ అసాధారణ పోరాటం కొనసాగింది.

12/06/2017 - 23:16

భువనేశ్వర్, డిసెంబర్ 6: పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ధారించాల్సి వచ్చిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంను 2-3 తేడాతో ఓడించిన భారత్ సెమీ ఫైనల్ చేరింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలవడంతో, పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

Pages