S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/20/2019 - 23:37

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత పేసర్ శ్రీశాంత్‌పై విధించిన సస్పెన్షన్ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) మధ్యవర్తి డీకే జైన్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తలపడినప్పుడు, సహచరురు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు శ్రీశాంత్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

08/20/2019 - 23:36

నార్త్ సౌండ్, ఆగస్టు 20: ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో పోటీతత్వం పెరుగుతున్నదని, అందుకే, ఈ ఫార్మాట్‌లోనూ హోరాహోరీ మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

08/20/2019 - 23:35

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్. 74 కిలోల విభాగం ట్రయల్స్ చివరి బౌట్‌లో అతను జితేందర్ కుమార్‌ను 4-2 తేడాతో ఓడించి, మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యాడు.

08/20/2019 - 23:33

వెల్లింగ్టన్, ఆగస్టు 20: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆక్లాండ్ ఓపెన్‌లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీకి ఆక్లాండ్ ఓపెన్‌ను వామప్ ఈవెంట్‌గా పేర్కొంది. చివరిసారి 2017లో ఆక్లాండ్ టోర్నీలో ఆడిన ఆమె మొదటి రౌండ్‌లో పాలైన్ పార్మెంటియర్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించింది.

08/20/2019 - 23:31

దుబాయ్, ఆగస్టు 20: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఫిర్యాదు అందింది. రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ సమయంలో వీరి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అనుమానంగా ఉందని మ్యాచ్ అధికారులుఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

08/20/2019 - 23:31

కూలిడ్జి (ఆంటిగువా), ఆగస్టు 20: అజింక్య రహానే, హనుమ విహారీ అర్ధ శతకాలు సాధించిన భారత్ ‘ఏ’, వెస్టిండీస్ ‘ఏ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 297 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా విండీస్ ‘ఏ’ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది.

08/19/2019 - 22:40

సిడ్నీ, ఆగస్టు 19: తమతో కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లంతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా నెక్ గార్డ్‌ను ధరించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) త్వరలోనే ఆదేశాలు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఏ అధికారులు ఈ అంశంపై చర్చలు జరిపారని, నిబంధనలను మార్చడం ద్వారా నెక్ గార్డ్‌ను కూడా తప్పనిసరి చేయనున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

08/19/2019 - 22:38

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పుడేకాదు.. రిటైరైన తర్వాత కూడా భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి. పాక్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరైన సమాధానమే ఇచ్చాడు.

08/19/2019 - 22:35

లండన్, ఆగస్టు 19: ఇంగ్లాండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్‌ను బ్రిటిష్ పత్రికలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఆడుతూ గాయపడిన జేమ్స్ ఆండర్సన్ స్థానంలో రెండో టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు బౌల్ చేసిన అతను 59 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.

08/19/2019 - 22:33

లండన్, ఆగస్టు 19: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆడిన జట్టునే మూడో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దించాలని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది.

Pages