S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/15/2019 - 22:47

న్యూఢిల్లీ, జూలై 15: టీమిండియా సపోర్టింగ్ స్ట్ఫా ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఆసక్తికల వారు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. చీఫ్ కోచ్ రవి శాస్ర్తీసహా ప్రస్తుతం ఆయా పదవుల్లో ఉన్న వారందరికీ ఈ ప్రకటన వర్తిస్తుంది. కొత్తవారి మాదిరిగానే, పాత కాపులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోకతప్పదు. టీమిండియా వచ్చేనెల వెస్టిండీస్ పర్యటనకు వెళుతుంది.

07/15/2019 - 01:19

న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ‘టై’*
సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం*
బౌండరీల ఆధారంగా విజేత ఎంపిక

07/15/2019 - 01:10

లండన్, జూలై 14: ఒక ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 575 పరుగులు) సొంతం చేసుకున్నాడు. 2007లో జయవర్ధనే 548 పరుగులతో నెలకొల్పిన రికార్డును అతను అధిగమించాడు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 2007లో 538 పరుగులు, ఈసారి వరల్డ్ కప్‌లో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 507 పరుగులు చొప్పున సాధించారు.

07/15/2019 - 03:32

లండన్, జూలై 14: చివరి క్షణం వర కూ హోరాహోరీగా సాగిన ఫైనల్లో స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్‌ను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్, ప్రపం చ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవి చ్ వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.

07/15/2019 - 00:58

ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత విజయ పరంపర కొనసాగిస్తున్న విజేందర్ సింగ్. అమెరికాలోని నెవార్క్‌లోని ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో జరిగిన బఔట్‌లో అతను మైక్ స్నిడర్‌ను ఓడించాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా 11 ఫైట్స్‌లో పాల్గొన్న విజేందర్‌కు ఇది వరుసగా 11వ విజయం.

07/15/2019 - 00:57

న్యూఢిల్లీ, జూలై 14: భారత అథ్లెట్ మహమ్మద్ అనాస్ పురుషుల 400 మీటర్ల మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, చెక్ రపబ్లిక్‌లో జరుగుతున్న క్లాండో అథ్లెటిక్స్ మీట్‌లో పోటీపడిన అతను 400 మీటర్ల దూరాన్ని 45.21 సెకన్లలో పూర్తి చేసి, స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అంతేగాక, గత ఏడాది 45.24 సెకన్లతో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు.

07/15/2019 - 00:55

లండన్, జూలై 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణపై ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఇక్కడ జరగనున్న సమావేశంలో చర్చించనున్నాయి. ఎనిమిది జట్లతో ఐపీఎల్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. 2011లో కొచ్చి, పుణే ఫ్రాంచైజీలు చేరడంతో వీటి సంఖ్య పదికి పెరిగింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)తో ఫీజు చెల్లింపు తదితర అంశాలపై తలెత్తిన వివాదాల కారణంగా కొచ్చి ఫ్రాంచైజ్ ఒక సీజన్‌కే పరిమితమైంది.

07/15/2019 - 01:08

విశ్వ విజేతగా ఇంగ్లాండ్*
సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం *
మొదటిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడిన ఆతిథ్య జట్టు*
వరుసగా రెండోసారి ఫైనల్‌లో ఓడిన కివీస్

07/14/2019 - 01:33

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన రుమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి, కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ ట్రోఫీని అందుకుంది.

07/13/2019 - 23:34

లండన్, జూలై 13: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు సిద్ధమైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచాయి. రెండు జట్లూ 1975 నుంచి ఈ మెగా టోర్నీలో పోటీపడుతున్నప్పటికీ ఇంత వరకూ టైటిల్‌ను సాధించలేదు. గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ టైటిల్ అవుతుంది. కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది.

Pages