S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/20/2017 - 01:16

ఈనెల 9వ తేదీ మంగళవారం రాత్రి ‘గౌరీ లంకేష్ పత్రికే’ అన్న పత్రికను నడుపుతున్న గౌరీ లంకేష్ అన్న 55 ఏళ్ళ జర్నలిస్టు- ఉద్యమకారిణి అయిన మహిళ- బెంగుళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఆవిడ ఇంటిముందు పిస్తోళ్ళతో ఏడుసార్లు కాల్చబడి చంపబడింది. బైక్‌మీద వచ్చిన ముగ్గురు ఆమెను కాల్చిపోయారు. వాళ్లు ఇంతవరకూ దొరకలేదు.. కారణాలు తెలియరావటంలేదు, కానీ కొన్ని అనుమానాలున్నాయి.

09/16/2017 - 01:04

భూతాపం పెరగడానికి, అందువల్ల మంచు ప్రాంతాలు కరిగి సముద్రమట్టం పెరగడానికి వాతావరణంలోకి వెలువడుతున్న శిలాజ ఇంధన వాడకం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో 90 కర్బన ఉత్పత్తి సంస్థలే ఇందుకు కారణమని స్పష్టమైంది.

09/16/2017 - 01:03

మానవాళితోపాటు సమస్త జీవరాశులకు ఆవాసమైన భూమి విపరీతంగా వేడెక్కుతోంది. వాతావరణం గతి తప్పుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాలవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సంద్రాలు జనావాసాలను ముంచెత్తుతున్నాయి. భూకంపాలతో భూమి బద్దలవుతోంది. అగ్నిపర్వతాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన కారణం పర్యావరణ మార్పులు.

09/14/2017 - 00:30

ఉపాధ్యాయునికి మెదడుకు, మేధస్సుకు ఉండే తేడా తెలియాలి. బ్రెయిన్ అండ్ మైండ్ ఈ రెండూ వేరు వేరు. బ్రెయిన్ పెరగదు. మేధస్సు పెరుగుతుంది. ఉపాధ్యాయుడు తన శ్రమవలన, తన సంకల్పంవలన పునశ్చరణ వలన మేధస్సును పెంచుతాడు. అదే విద్యార్థి జ్ఞాన సముపార్జనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వేలాది కంప్యూటర్‌ల సమూహమే మన మెదడు. దానిలో కేవలం 10 శాతం వరకు మాత్రమే వాడుకుంటున్నాం. ఒక ధాతువును సుత్తితో కొడితే అది వంగుతుంది.

09/13/2017 - 00:48

తెలంగాణలో ఇటీవలి కాలంలో రెండేళ్ల లోపు చిన్నారుల్లో బరువుతక్కువగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య 1.4 శాతం మేరకు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రెండేళ్ల లోపు చిన్నారుల్లో 33.1 శాతం మంది పిల్లలు ఉండవలసిన కనీస బరువుకన్నా తక్కువగా ఉన్నారు.

09/10/2017 - 00:48

ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ బాక్సులు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు రోజువా రీ చెత్తగా వీధిలోకి చేరుతోంది. బహిరంగ ప్రదేశాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ భద్రతకు పెను సవాలుగా మా రాయి.

09/10/2017 - 00:47

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర జలాలుగా మనం నెత్తిన జ ల్లుకుని ప్రణతులు అర్పించే జలదేవతల ఊపిరి హరింపచేస్తోంది.

09/07/2017 - 01:43

పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు అడుగులు వేసినపుడే అది వారి ప్రగతికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించినపుడే కొత్త ఆవిష్కరణలు ఆచరణ రూపం దాలుస్తాయి. కొత్త ఆలోచనల వల్ల నూతన సమాజాలు రూపొందుతాయి. ప్రతిరోజూ విద్యార్థి నూతనంగా కొత్త ఆవిష్కరణలు చేయడం వల్ల కొత్త కొత్త పరిశోధనలు చేయగలుగుతాడు. సాంకేతిక విప్లవాన్ని వికసింపజేయగలుగుతాడు.

09/03/2017 - 00:40

తెలుగంతా ఒకటే. ఒకప్పుడు తెలుగు ప్రాంతాలు వివిధ పరిపాలకుల పాలనల్లో ఉన్నందున పాలనా భాషలు వేర్వేరుగా ఉంటూ, పాలనా భాషలకు చెందిన పదాలు కలవడంతో తెలుగు భాష వేర్వేరుగా అనిపిస్తుంది. యాసల కలయిక వల్ల భిన్న ప్రాంతాల్లో తెలుగు విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆంగ్లేయుల ప్రభావం తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో కనపడుతుంది. మహమ్మదీల పాలనాప్రభావం తెలంగాణలో కనపడుతుంది.

09/01/2017 - 00:12

నరాల్ని ఎవరో గట్టిగా పట్టుకొని
ఉరితాళ్లు పేనుతున్నారు
చర్మం ఒలిచి పరుపుగా కుట్టించుకుని
దర్జాగా పడుకుంటున్నారు
ఆక్సిజన్ అందించలేక పిల్లల్ని
పీకల్ని నలుపుతున్నారు
చేతుల్లో కత్తులు పట్టుకుని
తలలను తరుగుతున్నారు !
బయటకు రావాలంటే
ఒకటే భయం...
తల్లి గుండెకోత అరుపులు
ఎవరికీ వినపడవు
లోపల ఉంటే ప్రాణాలు తీస్తారు

Pages