S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/02/2018 - 01:02

స్వామి వివేకానంధ మహాజ్ఞాని మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడు కూడా. ‘నాకు ధ్యానం ఎలా చే యాలో తెలియడం లేదు. నిగ్రహం గా ఉండలేకపోతున్నాన’ని వివేకానందుడిని ఒక భక్తుడు అడిగాడు. ఆ భక్తుడిని వివేకానందుడు ఒక చెరువు దగ్గరకు తీసుకుపోయాడు. నీళ్లలోకి దించాడు. అకస్మాత్తుగా అతనిని నీళ్లలో ముంచాడు. ఆ భక్తుడు నీళ్లలో తల్లడిల్లాడు. ఇంకా ఒత్తిడికి గురి చేశాడు.

03/01/2018 - 00:41

అజ్ఞానపు అంధకారాలను
జయించిన దివ్యజ్ఞాన జ్యోతి
అక్కడ ఆరిపోయింది!

అక్కడ వెలుగు కింద
కొన్ని కోట్ల నమ్మకాల గొంతులు
బిగుసుకుపోయాయి!

చీకట్లు అలుముకున్న
అందలి స్థలం ఒక్కసారిగా
నిశ్శబ్ద రోదనలు
అక్కడి హృదయాలను తాకాయి!

03/01/2018 - 00:37

సహస్ర చంద్రదర్శనం’ అంటే ఈ కాలంలో పూర్ణాయువే. పూర్ణాయువులో చివరిక్షణం వరకు ప్రయోజనాత్మకంగా జీవించి బ్రతుకుని సార్థకం చేసుకోవటం కొద్దిమంది ధన్యులకి మాత్రమే వీలవుతుంది. అటువంటి ధన్యులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి కైవల్యం పొందితే జయేంద్ర సరస్వతి 69వ శంకరాచార్యగా కంచిమఠ పీఠాధిపత్యం స్వీకరించారు.

02/28/2018 - 01:04

మనసులోని భావాలను వ్యక్తం చేయటానికి నవ్వు ఒక సాధనం. నవ్వడం నిజంగా ఒక కళ. ఒక మహిళ నవ్వు ‘పెద్దల సభ’లో ఈ మధ్య వెల్లివిరిసి, రాజకీయ సంచలనం కలిగించింది. రాజకీయ నాయకులు సమయానుకూలంగా హాస్యాన్ని జోడించి చేసే ప్రసంగాలకు పాలక, ప్రతిపక్షాలు కలసిమెలిసి హాయిగా నవ్వుకోవడం మనకు కొత్త కాదు.

02/24/2018 - 06:44

అస్పృశ్యత అనేది పూర్వం ఎక్కడా లేదు. ఇది మధ్యలో ఎప్పుడో ప్రవేశించింది. దీనికి వివిధ కారణాలు చెబుతున్నారు. కాని వాటిలోని విశ్వసనీయత అనుమానమే. దీనిని వజ్రాయుధంగా చేసుకుని మిషనరీలు చాలామంది దళితులను క్రైస్తవులుగా మార్చివేశారు. ఇలా మారినవారిలో కొందరిని మత బోధకులుగా తయారుచేశారు. అట్టివారి ఉపన్యాసాలు ఎంతో ఆవేశపూరితంగా వుంటాయి. ఈ విధంగా మిషనరీలు వారికి ఒక దేవుణ్ణి ఒక మతాన్ని ప్రసాదించారు.

02/21/2018 - 06:33

స్వాతంత్య్రానంతరం పోలీసు వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రభుత్వం కొన్ని పనులు చేసింది. కాని అవి అంతగా సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ‘పోలీసులు మీ మిత్రులు, వారి వద్దకు వెళ్లి నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. పోలీసు స్టేషన్లు దగ్గరగానున్న న్యాయస్థానాలవంటివి’ అని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతోంది. వాస్తవంగా అదేమీ జరగడం లేదు. చాలా స్టేషన్‌లలో గాంధీజీ చిత్రాలుంటాయి.

02/19/2018 - 23:17

విద్య, ఉపాధి రంగాల్లో దేశదేశాల యువతను ఆకర్షిస్తున్న అగ్రరాజ్యం అమెరికా నేడు.. ఉన్మాదుల, జాత్యంహకారుల దాడులతో భీతిల్లుతోంది. అభం శుభం తెలియని పసిపిల్లలను కాల్చి చంపే విద్వేష సంస్కృతి, విపత్కర తూటాల దుర్ఘటనలను ఆ సంపన్న దేశం ఎదుర్కొంటోంది.

02/17/2018 - 23:34

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏపీలో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అవకాశం దొరికినప్పుడల్లా మిత్రపక్షమైన బీజేపీపై అసంతృప్తిని వెళ్లగక్కుతునే ఉన్నారు.

02/17/2018 - 05:59

పరస్పర గౌరవమా?
‘సహనానికి ఆంగ్లంలో వాడే ‘టాలరెన్స్’ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇది ఒకరిని సహించడం లేదా భరించడం అనే అర్థాన్నిస్తుంది. పరస్పర గౌరవం, సహకారం అన్న అర్థాలని ఇది సూచించదు.

02/13/2018 - 02:27

నిజాం కాలం నాటి విశేషాలు కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాల వివరాలు కానీ, వివిధ కాలాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు కానీ తెలియాలంటే వెంటనే మనసులో మెదిలే పేరు జి.వెంకటరామారావు గారిది. ఆయన వృత్తిరీత్యా పాఠశాల అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు. కానీ- ప్రవృత్తిరీత్యా జర్నలిస్టు, ఇప్పటి జర్నలిస్టులకు అవకాశం లేని ఉర్దూ పాండిత్యం ఆయనకు ప్రధాన ఆయుధమైంది.

Pages